బాలీవుడ్‌పై సంచలన వ్యాఖ్యలు చేసిన సిమ్రాన్

Share


నార్త్ ఇండస్ట్రీలో కెరీర్ మొదలు పెట్టిన సిమ్రాన్, అసలు స్టార్‌డమ్‌ను మాత్రం సౌత్ సినిమాలతోనే అందుకుంది. బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చి దాదాపు మూడు దశాబ్దాలు గడిచిపోయాయి. ఈ 30 ఏళ్ల సినీ ప్రయాణంలో ఎన్నో హిట్ సినిమాల్లో నటించి, అభిమానులను అలరించింది. కానీ తాజాగా బాలీవుడ్‌పై సిమ్రాన్ చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

1995లో సనమ్ హర్జై సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన సిమ్రాన్, గోవిందా, సల్మాన్ ఖాన్, మిథున్ చక్రవర్తి, అజయ్ దేవగన్ వంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. అయినప్పటికీ తన అసలైన టాలెంట్‌ను బాలీవుడ్ గుర్తించలేదని సిమ్రాన్ చెప్పుకొచ్చింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ – “హిందీ సినిమాలతోనే కెరీర్ మొదలుపెట్టాను. కానీ ఇప్పటికీ బాలీవుడ్ వారికి నా పనితనం అర్థం కాలేదు. చాలా అవకాశాలు వస్తున్నా కూడా, రోల్ ఇవ్వడానికి ముందు టెస్ట్ వీడియోలు పంపమని అడుగుతున్నారు. వాళ్లకి నాపై డౌట్ ఉంటోంది. నేను దాన్ని తప్పు అనుకోవడం లేదు. ఎందుకంటే అందరికీ నా గురించి తెలియదు కదా. కానీ సౌత్‌లో ఇచ్చే రెమ్యూనరేషన్‌కి పదో వంతు మాత్రమే నార్త్ ఇండస్ట్రీలో ఇస్తారు. అందుకే నాకు బాగా తెలిసిన వారితోనే సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యాను” అని చెప్పింది.

అలాగే, “గుల్మోహర్ సినిమా సమయంలో అందరితో బాగా కలిసిపోయాను. కానీ తర్వాత చేసిన ప్రాజెక్టుల్లో ఉన్న వారితో అంతగా కనెక్ట్ కాలేకపోయాను” అని వెల్లడించింది.

హిందీలో ప్రారంభమైన కెరీర్, స్టార్‌డమ్ మాత్రం తెలుగు, తమిళ సినిమాలతోనే రావడం విశేషం. ప్రస్తుతం సిమ్రాన్ ది టూరిస్ట్ ఫ్యామిలీ తర్వాత కొన్ని చిన్న, మధ్య తరహా సినిమాల్లో అవకాశాలు అందుకుంటోంది. ఆ సినిమాల్లో ఆమెకు మంచి ప్రాధాన్యత ఉన్నా, పెద్ద ప్రొడక్షన్ హౌస్‌ల నుండి ఇప్పటివరకు ఒక్క అవకాశం కూడా రాలేదని చెప్పింది. ఇప్పుడు ఆమె ‘ద లాస్ట్ వన్’ సినిమాలో నటిస్తోంది.


Recent Random Post: