బిగ్ బాస్ స్టేజ్‌పై రష్మిక కామెంట్ వైరల్!

Share


బిగ్ బాస్ సీజన్ 9 వీకెండ్ ఎపిసోడ్‌లో స్టార్ సందడి జరిగింది. ఈసారి స్టేజ్ మీదకి నేషనల్ క్రష్ రష్మిక మందన్న అడుగు పెట్టింది. తాను నటించిన “ది గర్ల్‌ఫ్రెండ్” సినిమా ప్రమోషన్స్ కోసం హోస్ట్ నాగార్జునతో కలిసి పండగ వాతావరణం క్రియేట్ చేసింది.

స్టేజ్ మీద సరదా టచ్‌గా నాగార్జున –
“నువ్వు రష్మికగా వచ్చావా.. లేక గర్ల్‌ఫ్రెండ్‌గా వచ్చావా?”
అని అడుగుతారు. దానికి రష్మిక నవ్వుతూ –
“నేను అందరి గర్ల్‌ఫ్రెండ్‌నే!”
అని చెప్పిన కామెంట్ అక్కడున్న ఆడియన్స్‌కి ఒక షాక్-అండ్-స్మైల్ మోమెంట్‌గా మారింది.

రష్మికతో పాటు హీరో దీక్షిత్ శెట్టి కూడా హౌస్‌లోకి వచ్చినప్పుడు కంటెస్టెంట్లు ఎగ్జైటెడ్ అయ్యారు. ఈ సందర్భంగా హౌస్ మెంబర్స్‌తో కలిసి పొకిరి లిఫ్ట్ సీన్, అదుర్స్ సీన్ వంటి ఫన్ రీ-క్రియేషన్స్ చేయించారు. ఇది సండే ఎపిసోడ్‌కి పవర్‌ఫుల్ ఎంటర్తైన్‌మెంట్ అయ్యిందని చెప్పొచ్చు.

ఇక రష్మిక చెప్పిన “అందరి గర్ల్‌ఫ్రెండ్‌నే” అన్న మాట సోషల్ మీడియాలో హైలైట్‌గా మారింది. ముఖ్యంగా ఆమె వ్యక్తిగత జీవితంపై ఎప్పటికప్పుడు వచ్చే విజయ్ దేవరకొండ – రష్మిక గురించి ఉన్న రూమర్స్ మళ్లీ హాట్ టాపిక్ అయ్యాయి. అయితే వీరిద్దరూ ఎప్పటిలానే తమ వ్యక్తిగత విషయాలపై స్పందించకుండా ప్రొఫెషనల్‌గా కొనసాగుతున్నారు.

“ది గర్ల్‌ఫ్రెండ్” ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ రావడంతో రష్మిక ఈ సినిమాతో మరో హిట్ దక్కించుకుంటుందనే అంచనా. అలాగే ఆమె బాలీవుడ్ & టాలీవుడ్‌లో వీడీ 14, మైసా సినిమాలతో కూడా బిజీగా ఉంది.


Recent Random Post: