బిగ్ బీని టచ్ చేసిన పుష్ప రాజ్..!

ప్రస్తుతం పాన్ ఇండియా లెవెల్ లో పుష్ప 2 సంచలనాల గురించి అందరు మాట్లాడుకుంటున్నారు. పుష్ప రాజ్ పాత్రలో అల్లు అర్జున్ పూనకాలు తెప్పించే పర్ఫార్మెన్స్ తో అదరగొట్టాడు. పుష్ప 1 తో పోల్చితే కథ పరంగా పార్ట్ 2 పెద్దగా ఏమి లేకపోయినా సరే పుష్ప 2 మొత్తాన్ని కూడా అల్లు అర్జున్ భుజాన వేసుకుని నడిపించేశాడు. ఐతే ఈ సినిమా చేస్తున్న బాక్సాఫీస్ హంగామా చూసి బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా స్పందించారు.

పుష్ప 2 ప్రమోషన్స్ లో అల్లు అర్జున్ అమితాబ్ బచ్చన్ గారే తన ఇన్ స్ప్రేషన్ అని.. ఆయన నేషనల్ లెవెల్ మెగాస్టార్ అని అన్నారు. ఆయన స్పూర్తితోనే తాను సినిమాలు చేస్తున్నానని అన్నారు. ఐతే ఆ వీడియోకి కాస్త లేట్ గా స్పందించారు అమితాబ్ బచ్చన్. అల్లు అర్జున్ జీ అంటూ ప్రేమగా మొదలు పెట్టిన అమితాబ్ నీ వర్క్ కి మేమంతా అభిమానులమే నువ్వు కూడా ఎంతోమందికి స్పూర్తిగా నిలుస్తున్నావు అంటూ ట్వీట్ చేశారు అమితాబ్ బచ్చన్. బిగ్ బీ ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

అల్లు అర్జున్ పుష్ప 2 బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తుంది. సినిమా తెలుగు రెండు రాష్ట్రాల్లో కన్నా బాలీవుడ్ లో ఆడియన్స్ కు బాగా ఎక్కేసింది. ముఖ్యంగా అల్లు అర్జున్ చేసిన పుష్ప రాజ్ పాత్ర అక్కడ బీ టౌన్ ఆడియన్స్ కు పూనకాలు తెప్పించేస్తుంది. సినిమాకు అసలే నార్త్ సైడ్ దుమ్ము దులిపేస్తున్న ఈ టైం లో అమితాబ్ బచ్చన్ వేసిన ట్వీట్ కూడా సినిమా మీద ఇంకాస్త ఎఫెక్ట్ పడేలా చేస్తుంది.

కచ్చితంగా పుష్ప 2 కలెక్షన్స్ సునామి సృష్టిస్తున్న ఈ టైం లో బిగ్ బీ అమితాబ్ బచ్చన్ కూడా అల్లు అర్జున్ గురించి ట్వీట్ చేయడం చూస్తుంటే పుష్ప 2 తాకిడి ఏ రేంజ్ లో ఉందో అర్ధం చేసుకోవచ్చు. పుష్ప 2 తెలుగు రెండు రాష్ట్రాలకు ఈక్వల్ గా కాదు ఒక సందర్భంలో ఇంకాస్త ఎక్కువ ఇంపాక్ట్ చూపిస్తుంది. బీ టౌన్ ఆడియన్స్ మొత్తాన్ని పుష్ప 2 ఒక మాస్ వైబ్ లోకి తీసుకెళ్లింది. తప్పకుండా ఈ సినిమా లాంగ్ రన్ లో మరిన్ని రికార్డులు సృష్టించేలా ఉంది. పుష్ప 2 ఆల్ టైం రికార్డులతో బాలీవుడ్ లో దూసుకెళ్తుంది. చూస్తుంటే బాలీవుడ్ లోనే ఈ సినిమా 500 కోట్లు దాటి నెవర్ బిఫోర్ రికార్డులను సృష్టించేలా ఉంది.


Recent Random Post: