
స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న ప్రస్తుతం తన కెరీర్లో రెంజ్ మార్చేసింది. వరుస సినిమాలు చేస్తూ హిట్ల పరంపరను కొనసాగిస్తున్న రష్మిక.. సౌత్ నుంచే కాకుండా బాలీవుడ్‌లోనూ మంచి క్రేజ్ తెచ్చుకుంది. ఈ సమయంలోనే ఆమె మరో కొత్త దారిలో అడుగుపెట్టింది. అదే బిజినెస్ రంగం.
రష్మిక తన కొత్త ప్రయాణం గురించి స్వయంగా సోషల్ మీడియాలో షేర్ చేయడం ఇప్పుడు వైరల్ అవుతోంది. తన పోస్టులో “నేను చివరికి దీన్ని రికార్డ్ చేస్తున్నాననే విషయాన్ని నమ్మలేకపోతున్నాను. నా హృదయానికి చాలా దగ్గరగా ఉన్న పనిపై ఇప్పుడు ముందడుగు వేసినందుకు సంతోషంగా ఉంది. త్వరలోనే మీ అందరితో దీన్ని పంచుకుంటాను. నాకు చాలా ఉత్సాహంగా, ఆందోళనగా, కృతజ్ఞతతో ఉంది” అంటూ చెప్పింది.
తన తల్లితో జరిగిన చిన్న సంభాషణ వీడియోను కూడా రష్మిక షేర్ చేసింది. అందులో “ఇప్పుడు నేను ఒక ముఖ్యమైన షూట్‌కు వెళ్లిపోతున్నాను. మీరు చెప్పిన బిజినెస్‌ను స్టార్ట్ చేయబోతున్నాను” అని తల్లితో చెప్పగా ఆమె “బెస్ట్ ఆఫ్ లక్” అంటూ ఆశీర్వదించారు.
ఇకపోతే, రష్మిక ఏ బిజినెస్ ప్రారంభించబోతున్నదనే విషయాన్ని మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే ఇప్పటికే చాలా మంది స్టార్ హీరోయిన్స్ ఫ్యాషన్, స్కిన్‌కేర్, హెల్త్ రిటైల్ బ్రాండ్స్‌తో సక్సెస్ఫుల్ బిజినెస్‌వుమెన్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ దారిలోనే రష్మిక కూడా తన ప్రయాణం మొదలు పెడుతోందని టాక్. ప్రస్తుతం సోషల్ మీడియాలో రష్మికకు ఆల్ ది బెస్ట్ మెసేజ్‌లు వెల్లువెత్తుతున్నాయి.
Recent Random Post:














