
భైరవం సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకొచ్చిన బెల్లంకొండ శ్రీనివాస్, ఫలితాలు ఎలా ఉన్నా తన వంతు శాతం కృషి చేసి, మాస్ ఆడియన్స్‌ని అలరించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నాడు. భైరవం తర్వాత ఆయన చేతిలో ఇప్పుడు రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఈ రెండు సినిమాలు కూడా పూర్తిగా విభిన్నమైన కథాంశాలతో తెరకెక్కుతున్నాయి.
మొదటిది ‘టైసన్ నాయుడు’, దీనికి టాలెంటెడ్ దర్శకుడు సాగర్ చంద్ర దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో బెల్లంకొండ హీరో శక్తివంతమైన పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడు. సినిమాకి యాక్షన్‌తో పాటు కొత్త తరహా ట్రీట్మెంట్ ఉండబోతుందనే టాక్ వినిపిస్తోంది. ఇందులో హీరోయిన్గా నభా నటేష్ నటిస్తోంది.
రెండవ సినిమా ‘కిష్కింధపురి’, ఇది హారర్ థ్రిల్లర్ నేపథ్యంలో సాగనుంది. ఈ చిత్రాన్ని కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. విభిన్నమైన కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై బెల్లంకొండ బాబు చాలా నమ్మకం పెట్టుకున్నాడు. ఈ సినిమాలో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్గా నటిస్తోంది.
ప్రతి సినిమాకు తన వంతు శక్తి వంచన లేకుండా కష్టపడుతున్న బెల్లంకొండ శ్రీనివాస్, విజయాన్ని సాధించేవరకు వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని చూపిస్తున్నాడు. భైరవం సినిమాలో మంచు మనోజ్, నారా రోహిత్‌లతో కలిసి పనిచేసిన ఆయన, భవిష్యత్తులో మరిన్ని మల్టీస్టారర్ ప్రాజెక్టులకు సిద్ధంగా ఉన్నాడు.
త్వరలో రానున్న ‘టైసన్ నాయుడు’ మరియు ‘కిష్కింధపురి’ సినిమాలు బెల్లంకొండ అభిమానులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించనున్నాయి. ఈ సినిమాల ద్వారా ఒక మాస్ హిట్ కొట్టి, తన స్టామినా ఏంటో నిరూపించుకోవాలని బెల్లంకొండ బాబు లక్ష్యంగా పెట్టుకున్నాడు.
Recent Random Post:















