బోయపాటి శ్రీను నెక్స్ట్ టార్గెట్ అల్లు అర్జున్?

Share


ప్రఖ్యాత దర్శకుడు బోయపాటి శ్రీను నాలుగోసారి బాలకృష్ణతో అఖండ 2 మూవీ చేశారు. పాన్ ఇండియా మూవీగా రాబోయే ఈ సినిమా మిక్స్డ్ టాక్‌తో ఆడుతోంది. అయితే, ఈ సినిమా టాక్‌ను పక్కన పెట్టి చూడాలి అంటే… పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్ తెచ్చుకోవాలంటే బోయపాటికి నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో కూడా పాన్ ఇండియా లెవెల్ హీరోలతో సినిమాలు చేయాల్సి వస్తుంది. తాజాగా వచ్చే టాక్ ప్రకారం, బోయపాటి నెక్స్ట్ టార్గెట్ అల్లు అర్జున్ అని వినిపిస్తోంది.

కాగా, గతంలో సరైనోడు ఫంక్షన్‌లో అల్లు అర్జున్ బోయపాటితో మరో సినిమా చేయాలని వ్యక్తపరచారు. అదేవిధంగా, గత ఐదు సంవత్సరాల క్రితం గీత ఆర్ట్స్ నుండి బోయపాటి అడ్వాన్స్ తీసుకున్నారు అనే విషయం అల్లు అర్జున్ తల్లీ అల్లు అరవింద్ స్వయంగా వెల్లడించారు. ఇంకా, బోయపాటి – అల్లు అర్జున్ మధ్య మంచి సాన్నిహిత్యం కూడా ఉంది. ఈ నేపధ్యంలో బోయపాటి – అల్లు అర్జున్ కాంబినేషన్ కోసం కథనాలు వినిపిస్తున్నాయి.

కానీ ప్రాక్టికల్‌గా చూడాల్సిన విషయం ఏంటంటే… పుష్ప మరియు పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ రేంజ్ విపరీతంగా పెరిగిపోయింది. ఇప్పుడు ఆయన పాన్ ఇండియా కంటే పాన్ వరల్డ్ స్థాయిలో సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో సైన్స్ ఫిక్షన్ మూవీ చేస్తున్నాడు. ఈ సినిమాను పాన్ వరల్డ్ లెవెల్‌లో విడుదల చేసేందుకు విఎఫ్ఎక్స్, హాలీవుడ్ స్థాయి సాంకేతిక బృందాలు పనిచేస్తున్నాయి. అదేవిధంగా, కోలీవుడ్ బడా నిర్మాత కళానిధి మారన్ సన్ పిక్చర్స్ బ్యానర్‌లో వందల కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించారు.

ఇలాంటి పరిస్థితుల్లో, మిక్స్డ్ టాక్‌తో రన్ అవుతున్న డైరెక్టర్ బోయపాటి శ్రీనుకి అల్లు అర్జున్ అవకాశం ఇస్తాడా అనే అనుమానాలు కూడా వినిపిస్తున్నాయి. పైగా, పాన్ వరల్డ్ స్థాయికి ఎదుగుతున్న అల్లు అర్జున్ ఇప్పుడు లోకల్ డైరెక్టర్లకు అవకాశం ఇస్తారా? పూర్తి వివరాలు బోయపాటి నెక్స్ట్ మూవీ ప్రకటించేవరకు తెలియదనే చెప్పాలి.


Recent Random Post: