భాగ్య శ్రీ బోర్స్‌కు లెనిన్‌తో బ్రేక్ వస్తుందా?

Share


అందం, అభినయం రెండూ ఉన్నప్పటికీ సరైన హిట్ అందుకోవడంలో కాస్త వెనుకబడిన నటి భాగ్య శ్రీ బోర్స్. పర్ఫెక్ట్ స్టార్ హీరోయిన్ మెటీరియల్ అని పేరు తెచ్చుకున్న ఈ భామ, తొలి సినిమా మిస్టర్ బచ్చన్తోనే యూత్ ఆడియన్స్‌లో మంచి క్రేజ్ సంపాదించింది. అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది.

ఆ తర్వాత విజయ్ దేవరకొండ – కింగ్‌డమ్ సినిమాతో తన సత్తా చూపిస్తుందని భావించినా, ఆ సినిమాలో భాగ్య శ్రీ పాత్ర హీరోయిన్‌కి తక్కువ, సైడ్ రోల్‌కి ఎక్కువ అన్నట్టుగా డిజైన్ చేశారు. అంతేకాదు, హీరో–హీరోయిన్ మధ్య ఉండాల్సిన పాటను కూడా తొలగించడంతో భాగ్య శ్రీ అభిమానులు తీవ్రంగా నిరాశ చెందారు.

ఆ సినిమా ఫలితాన్ని ఊహించని భాగ్య శ్రీ కొంత అప్సెట్ అయినా, నవంబర్‌లో రెండు వారాల గ్యాప్‌లో రెండు సినిమాలతో ప్రేక్షకులను అలరించింది. ఒకటి కాంత, మరొకటి రామ్‌తో చేసిన ‘ఆంధ్రా కింగ్ తాలూకా’. రామ్ సినిమా కొంతవరకు సందడి చేసినా, కాంత మాత్రం వచ్చినట్టే వచ్చి వెళ్లిపోయింది. ‘ఆంధ్రా కింగ్ తాలూకా’ మంచి సినిమా అయినప్పటికీ, ప్రేక్షకులు ఎందుకో పెద్దగా రిసీవ్ చేసుకోలేదు. అయితే ఆ సినిమాలో భాగ్య శ్రీ లుక్స్ మాత్రం అందరి దృష్టిని ఆకర్షించాయి.

ఇప్పుడు భాగ్య శ్రీ ఆశలన్నీ అక్కినేని అఖిల్‌తో చేస్తున్న ‘లెనిన్’ సినిమాపైనే ఉన్నాయి. ఇప్పటివరకు ఆమె చేస్తున్న సినిమాలన్నీ రిలీజ్ ముందు మంచి బజ్ తెచ్చుకుని, రిలీజ్ తర్వాత మాత్రం నిరాశ పరచడం ఆమె కెరీర్‌లో రిపీట్ అవుతూ వచ్చింది. అయితే ‘లెనిన్’ విషయంలో మాత్రం అలాంటిది జరగకూడదని భాగ్య శ్రీ గట్టిగా కోరుకుంటోంది.

కాంత, ఆంధ్రా కింగ్ తాలూకా సినిమాల ఫలితాలు ఎలా ఉన్నా, భాగ్య శ్రీలో ఉన్న గ్లామర్‌తో పాటు యాక్టింగ్ టాలెంట్‌ను మాత్రం ప్రేక్షకులు గుర్తించారు. కాబట్టి ‘లెనిన్’ కమర్షియల్ హిట్ అయితే, భాగ్య శ్రీ తిరిగి ఫామ్‌లోకి వచ్చినట్టే. అందుకే ఈ సినిమాపై ఆమె భారీ ఆశలు పెట్టుకుంది.

వాస్తవానికి అఖిల్ – లెనిన్ సినిమాను నవంబర్‌లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేశారు. కానీ పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా కొంత షూటింగ్ మిగిలి ఉండటంతో, వచ్చే ఏడాది ఫిబ్రవరి లేదా సమ్మర్ రిలీజ్కు ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘లెనిన్’ నుంచి గతంలో విడుదలైన టీజర్ మంచి ఇంప్రెస్ ఇచ్చింది. మొదట ఈ సినిమాలో హీరోయిన్‌గా శ్రీలీలను అనుకోగా, ఆమెతోనే టీజర్ కూడా విడుదల చేశారు. అయితే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో, ఆమె స్థానంలో భాగ్య శ్రీ బోర్స్‌ను తీసుకున్నారు.


Recent Random Post: