
బాలీవుడ్‌లో దేశభక్తి నేపథ్య సినిమాలు సాధారణంగా భారీ ఆదరణ పొందుతాయి. రకరకాల నేపథ్యాలతో తెరకెక్కిన చిత్రాలు సక్సెస్ అవ్వడం సాధారణం. ఇటీవల విడుదలైన ధురంధర్ ఈ ట్రెండ్‌ను కొనసాగించింది. స్పై థ్రిల్లర్ జానర్‌లో రణవీర్ సింగ్ ఆకట్టుకున్నాడు. అలాగే, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్, హృతిక్ రోషన్, అమీర్ ఖాన్, విక్కీ కౌశల్, టైగర్ శ్రాఫ్ వంటి స్టార్ హీరోలు దేశభక్తి నేపథ్యంలో సినిమాలు చేసి బ్లాక్‌బస్టర్ విజయాలు సాధించారు.
కానీ బాలీవుడ్ క్వీన్ కంగన రనౌత్ ఈ జానర్‌లో ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ, ఆశించిన ఫలితాలు పొందలేకపోయింది. ‘ధాకడ్’, ‘తేజస్’ వంటి సినిమాలు భారీ అంచనాలతో రిలీజ్ అయినా క్రమంగా విఫలమయ్యాయి. ఈ సినిమాలు ఆమె స్పై జానర్‌లో సత్తా చాటే ప్రయత్నాలే. ఆ తర్వాత ఇందీరాగాంధీ బయోపిక్తో దేశభక్తిని చాటేందుకు ప్రయత్నించగా, అది కూడా నిరాశగా మారింది.
ఇప్పటివరకు, కంగన ఎక్కడా నెరవెలేదు. మరీ దేశభక్తి నేపథ్యంలో మరోసారి ప్రయత్నం చేస్తోంది. ఇప్పుడు భారత భాగ్య విధాత అనే టైటిల్‌తో కొత్త సినిమా తీస్తున్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్‌పై కంగన ఇంకా మీడియాకు పూర్తి వివరాలు వెల్లడించలేదు. సినిమా ఆన్-సెట్‌లో ఉంది, ఆమె స్వంత నిర్మాణ సంస్థ మణికర్ణిక ఫిల్మ్స్ ప్రొడక్షన్ బ్యానర్‌పై నిర్మిస్తోంది. అయితే ఆమె స్వీయ దర్శకత్వంలోనా లేదా పాత్ర-నిర్మాణం వరకే పరిమితం అవుతుందా అనే వివరాలు తెలియాల్సి ఉంది.
Recent Random Post:















