భైరవం రీ ఎంట్రీలో భావోద్వేగమైన మంచు మనోజ్

Share


టాలీవుడ్‌లో తనదైన శైలి, ఎనర్జీతో ప్రత్యేక గుర్తింపు పొందిన మంచు మనోజ్, కొంతకాలంగా సినిమాలకు విరామం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన “నాంది” ఫేమ్ విజయ్ కనకమేడల దర్శకత్వంలో తెరకెక్కిన “భైరవం” చిత్రంతో మళ్లీ వెండితెరపైకి రాబోతున్నారు. ఈ చిత్రం మే 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాతో ప్రముఖ దర్శకుడు శంకర్ కూతురు అదితి శంకర్ టాలీవుడ్‌లో హీరోయిన్‌గా పరిచయమవుతోంది. ముగ్గురు యువ హీరోలు నటిస్తున్న ఈ మల్టీ స్టారర్‌కు ఇప్పటికే మంచి బజ్ నెలకొంది. ప్రమోషన్ కార్యక్రమాల్లో యాక్టివ్‌గా పాల్గొంటున్న మంచు మనోజ్, తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

ఈ సందర్భంగా ఆయన తన అక్క మంచు లక్ష్మి గురించి మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు.
“ఆమె నాకు అక్క కాదు, అమ్మలా” అంటూ చెప్పారు. నెలరోజుల క్రితం ఒక ఫ్యాషన్ షోలో తాము కలిసి భావోద్వేగానికి లోనైన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. దానిపై స్పందించిన మనోజ్,
“గత కొంతకాలంగా ఇద్దరం మా జీవితాల్లో బిజీ అయ్యాం. దాదాపు నెల రోజుల తర్వాత చూసుకున్నాం. అప్పుడు ఇద్దరం ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాం. ఆమె నా బెస్ట్ ఫ్రెండ్, అమ్మలా ఉందెప్పుడూ” అని తెలిపారు.

ఇదే విషయాన్ని ఇటీవల మంచు లక్ష్మి కూడా ఓ కార్యక్రమంలో మాట్లాడారు.
“మనోజ్ నా లైఫ్‌లోనే పెద్ద ఇరిటేటింగ్ పర్సన్. అయితే ఒక్కసారిగా కనిపించడంతో కన్నీళ్లు వచ్చాయి” అంటూ మనోజ్‌తో తన అనుబంధాన్ని వెల్లడించారు.

తాజా ఈ వ్యాఖ్యలు చూస్తే, మనోజ్-లక్ష్మిల మధ్య ఉన్న గాఢమైన బంధం ఇప్పటికీ అలాగే ఉందని స్పష్టమవుతోంది. కుటుంబ విభేదాల గురించి గతంలో ఎన్నో వార్తలు వచ్చినా, వీరి అనుబంధాన్ని మాత్రం అవి ప్రభావితం చేయలేకపోయాయి.


Recent Random Post: