
చాలా సినిమాలు మొదట రాసిన కథతోనే సెట్స్ మీదకు వెళ్తాయి. కానీ షూటింగ్ సమయంలో అనుకోని మార్పులు జరుగుతాయి. ఇవి కొన్నిసార్లు సినిమాకు అదనపు బలం ఇస్తే, కొన్ని సార్లు మాత్రం వెనక్కి లాగేస్తాయి.
అలా మార్పుల చుట్టూ తిరిగిన సినిమా శివకార్తికేయన్ – మురుగదాస్ కాంబినేషన్లో వచ్చిన మదరాసి. సెప్టెంబర్ 5న విడుదలైన ఈ యాక్షన్ థ్రిల్లర్‌కు ప్రేక్షకుల నుండి మిక్స్డ్ రివ్యూలు వచ్చాయి. తెలుగు వెర్షన్లో కలెక్షన్లు బలహీనంగా ఉండగా, తమిళనాట మాత్రం వీకెండ్లో బాగా వసూళ్లు రాబట్టింది. అయితే వీకెండ్ ముగిసిన వెంటనే అక్కడ కూడా కాస్త తగ్గింది.
ఇప్పుడేమో మురుగదాస్ ఈ సినిమా క్లైమాక్స్ గురించి ఆసక్తికర విషయాన్ని బయటపెట్టారు. మొదట తాను కథను హీరోయిన్ చనిపోవడంతో ముగించాలనుకున్నానని చెప్పారు. మాలతి మరణంతో హీరో రఘు జీవితంలో పెద్ద మార్పు వస్తుందని, అప్పటివరకు ఎవరికీ సహాయం చేయని అతను, ఆమె లేని సమయంలో అందరికీ సహాయం చేసేలా ప్లాన్ చేశానని తెలిపారు.
కానీ, హీరో తన ప్రేయసిని కాపాడలేకపోతే క్యారెక్టర్ బలహీనంగా అనిపిస్తుందనే భావనతో షూటింగ్ మధ్యలోనే క్లైమాక్స్ మార్చానని చెప్పారు మురుగదాస్. ఈ విషయమే ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది. కొందరు నెటిజన్లు మాత్రం – “అసలు ప్లాన్ చేసినట్లే క్లైమాక్స్ ఉంటే మదరాసి బ్లాక్‌బస్టర్ అయ్యేది” అని కామెంట్ చేస్తున్నారు.
ఈ సినిమాలో విద్యుత్ జమ్వాల్ విలన్‌గా మెప్పించగా, అనిరుధ్ రవిచందర్ అందించిన సంగీతం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
Recent Random Post:















