మరో క్రేజీ డైరెక్టర్ ను లైన్ లో పెట్టిన విజయ్

కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ తాజాగా తళపతి విజయ్ ని లైన్ లో పెట్టాడు. రీసెంట్ గా ‘జిగర్తాండ డబుల్ ఎక్స్’ మూవీతో ప్రశంసలు అందుకున్న ఈ దర్శకుడు తన తదుపరిచిత్రాన్ని తలపతి విజయ్ తో చేయబోతున్నట్లు కోలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో వార్తలు ఊపందుకున్నాయి. తాజా సమాచారం ప్రకారం కార్తీక్ సుబ్బరాజ్ ఇటీవల దళపతి విజయ్ ని కలిసి ఓ కథ వినిపించారని, ఆ కథ విజయ్ కి బాగా నచ్చడంతో వెంటనే సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

‘పిజ్జా’ సినిమాతో డైరెక్టర్ గా కెరియర్ స్టార్ట్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్ తనదైన డిఫరెంట్ ఫిలిం మేకింగ్, స్టోరీ టెల్లింగ్ తో కోలీవుడ్ లో టాలెంటెడ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్నారు. రీసెంట్ గా ఈయన దర్శకత్వంలో వచ్చిన ‘జిగర్ తండా డబుల్ ఎక్స్’ కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. కార్తీక్ ఫిలిం మేకింగ్ కి హాలీవుడ్ డైరెక్టర్ క్లింట్ ఈస్ట్ వుడ్ కూడా ఫిదా అవుతూ ఈ సినిమాని చూస్తానని చెప్పడం మామూలు విషయం కాదు.

ఆ రేంజ్ లో తనదైన డిఫరెంట్ ఫిల్మ్ మేకింగ్ తో ఆకట్టుకున్న కార్తీక్ సుబ్బరాజ్ ఈసారి ఏకంగా తలపతి విజయ్ నే మెప్పించాడు. నిజానికి ఈ డైరెక్టర్ చాలా కాలంగా విజయ్ తో సినిమా చేయాలని ప్రయత్నిస్తున్నాడు. ఆ మధ్య తన దగ్గర ఉన్న కొన్ని కథలు కూడా చెప్పాలని ట్రై చేశాడు. కానీ అవేవీ వర్కౌట్ కాలేదు. అయితే ఈసారి మాత్రం ఓ సరికొత్త కథతో విజయ్ ని ఆకట్టుకున్నాడని, ఈ ప్రాజెక్ట్ విజయ్ తదుపరి చిత్రంగా ఉంటుందని అంటున్నారు.

అంతేకాదు కోలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించనున్నట్లు సమాచారం. ‘లియో’ సక్సెస్ తర్వాత ప్రెజెంట్ వెంకట్ ప్రభుతో సినిమా చేస్తున్నాడు విజయ్. ఈ మూవీ చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా పూర్తవగానే వెంటనే కార్తీక్ సుబ్బరాజ్ తో సినిమా చేయాలని తలపతి విజయ్ భావిస్తున్నట్లు తెలిసింది.

కోలీవుడ్ లో ఇప్పటివరకు మీడియం రేంజ్ హీరోలని డైరెక్ట్ చేసిన కార్తీక్ సుబ్బరాజ్ ఫస్ట్ టైం తలపతి విజయ్ లాంటి స్టార్ హీరోతో సినిమా చేస్తుండడం కోలీవుడ్ వర్గాల్లో సర్వత్ర ఆసక్తికరంగా మారింది. త్వరలోనే ఈ ప్రాజెక్టుకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చే అవకాశం ఉంది.


Recent Random Post: