మహేష్‌ బాబు ‘సాక్షి’ ఇప్పుడు ఇలా..!

సూపర్ స్టార్‌ మహేష్ బాబు కెరీర్ ఆరంభంలో నటించిన సినిమాల్లో హీరోయిన్స్‌ గా కనిపించిన వారిలో చాలా మంది గుర్తు పట్టనంత గా మారి పోయారు. కొందరు మాత్రం గతంలో ఎలా అయితే ఉన్నారో ఇప్పటికి కూడా అలాగే అందంగా ఉన్నారు.

మహేష్ బాబు హిట్ మూవీ యువరాజులో నటించిన ముద్దుగుమ్మ సాక్షి శివానంద్‌. ఈ అమ్మడు 90 ల్లో వరుసగా స్టార్‌ హీరోల సినిమాల్లో నటించడం ద్వారా స్టార్‌ హీరోయిన్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది. టాలీవుడ్‌ లోనే కాకుండా ఇతర భాషల్లో కూడా ఈ అమ్మడికి మంచి గుర్తింపు దక్కింది.

1996 లో హిందీ సినిమా ద్వారా ఇండస్ట్రీలో అడుగు పెట్టిన ఈ అమ్మడు తక్కువ సమయంలోనే మెగాస్టార్ చిరంజీవి కి జోడీగా మాస్టర్ సినిమాలో నటించే అవకాశం దక్కింది. ఆ తర్వాత నాగార్జున సినిమాలో నటించింది. మహేష్ బాబు తో ఈమె నటించిన యువరాజు తో మంచి మార్కులు దక్కించుకుంది.

రాజశేఖర్ తో సింహరాశి సినిమాను చేసిన ఈ అమ్మడు హిట్ ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి ఈ అమ్మడి కెరీర్‌ డౌన్ ఫాల్‌ మొదలయ్యింది. ఆ సినిమా తర్వాత కొన్ని సినిమాల్లో నటించినా కూడా అవేవి సాక్షి కి పూర్వ వైభవం ను తెచ్చి పెట్టలేక పోయాయి.

చాలా కాలంగా కనీసం సోషల్‌ మీడియా ద్వారా కూడా కనిపించకుండా దూరంగా ఉంటున్న సాక్షి శివానంద్ ఎట్టకేలకు ఒక ప్రైవేట్‌ కార్యక్రమంలో స్నేహితులతో సరదాగా ఉన్న ఫోటోలు సోషల్‌ మీడియా ద్వారా బయటకు వచ్చాయి. ఈ ఫోటోలు ప్రస్తుతం వైరల్‌ అవుతున్నాయి.

హీరోయిన్‌ గా చేస్తున్న సమయంలోనే సాక్షి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది. పెద్దగా ముఖం లో మార్పు రాలేదు కానీ కాస్త బరువు పెరిగినట్లుగా మాత్రం అనిపిస్తుందని నెటిజన్స్‌ మరియు ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.


Recent Random Post: