మా బొంబాయి అంతా బిచ్చగాళ్లేనన్న నటి

`విక్రమ్ వేద` చిత్రంలో అద్భుత నటనతో కట్టి పడేసిన రాధిక ఆప్టే మరోసారి బెస్ట్ పెర్ఫామర్ అన్న పేరు తెచ్చుకుంది. ఆప్టే నటించిన తదుపరి చిత్రం `మోనికా ఓ మై డార్లింగ్` ఇప్పుడు విడుదలకు సిద్ధంగా ఉంది. రిలీజ్ ముందు ప్రమోషన్స్ తో పూర్తి బిజీగా ఉన్న ఆప్టే మీడియా ఇంటరాక్షన్స్ లో చాలా ఆసక్తికర విషయాలను ముచ్చటిస్తోంది. ఒకసారి విజయాన్ని రుచి చూసిన తర్వాత తన జీవనశైలి ఎలా మారిపోయిందనే దానిపైనా ఆప్టే ముచ్చటించింది. నటవారస ప్రపంచంలో ఆప్టే తనను తాను ఎలా నిలబెట్టుకుంటుందో కూడా వెల్లడించింది.

థియేటర్ ఆర్టిస్టుగా కెరీర్ ప్రారంభించినప్పటి నుండి … ఇప్పుడు సినిమాలు చేస్తున్న క్రమంలో తన జీవితం ఎలా మారిపోయిందనే దాని గురించి ప్రశ్నించగా… తన జీవనశైలి పెద్దగా ఏమీ మారలేదని వివరించింది. తాను ఎలా నిలదొక్కుకున్నాననే దానిపై మాట్లాడుతూ.. ఇక్కడ ఎవరైనా తన చుట్టూ ఏం జరుగుతోందో పరిశీలనగా చూడాల్సిన అవసరం ఉందని అన్నారు.

సేక్రేడ్ గేమ్స్ సహా ఎన్నో విలక్షణ సిరీస్ లలోను నటించిన ఆప్టే కిటికీలోంచి చూడాలి! అంటూ గుంబనగా మాట్లాడడం ఆశ్చర్యపరిచింది. “మీరు చేయాల్సిందల్లా మీ కిటికీలోంచి చూడడమే. మేం బొంబాయిలో నివసిస్తున్నాం. వీధులన్నీ యాచకులతో నిండిపోయాయి. COVID సమయంలో ఏం జరిగిందో మనకు తెలుసు. ఇది మన చుట్టూ ఉంది. ఇది ప్రతిచోటా ఉంది. ఎప్పుడు ఏం జరుగుతుందో .. మీరు ఎక్కడ ఉంటారో మీకు ఎప్పటికీ తెలియదు“ అంటూ వేదాంతం ధోరణితో రాధిక మాట్లాడిన తీరు తన అనుభవాలను బహిర్గతం చేస్తోంది.

నా ఉద్దేశ్యంలో ప్రపంచంలో చాలా జరుగుతున్నాయి. ప్రస్తుతానికి ప్రజలు బాగానే ఉన్నారు. రేపటికి ఇల్లు ఉంటుందో లేదో.. ఏమీ లేకపోయినా లేకపోవచ్చు. ఇక్కడ అలా జరుగుతుందని నేను చెప్పడం లేదు కానీ మీరు చుట్టూ చూడాల్సిందే… బతకాలంటే!! అని వాస్తవిక ప్రపంచం నడువడి ఎలా ఉందో రాధిక కొంత వివాదాన్ని రాజేసిందనే చెప్పాలి. ప్రభుత్వాలు ఎన్ని మారుతున్నా ప్రజల తలరాతలు మారలేదని రాధిక పరోక్షంగా విమర్శించింది. ఇంకా పవిత్ర భారతదేశంలో యాచకులు పెరుగుతున్నారే కానీ తరగడం లేదు.. దీనిని దేశ పురోగతి అని అనగలమా? అని పరోక్షంగా ఈ చాటింగ్ సెషన్ లో ప్రశ్నించింది. ఈరోజు ఉన్నది రేపు లేదు. రేపు ఉన్నది తర్వాత ఉంటుందన్న గ్యారెంటీ లేదు! అంటూ వేదాంతం వల్లించింది.

రాధిక ఆప్టే నటించిన `మోనికా ఓ మై డార్లింగ్` నవంబర్ 11న ప్రత్యేకంగా నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది. వాసన్ బాలా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రాజ్ కుమార్ రావు – హుమా ఖురేషి తదితరులు నటించారు. రాధిక ఒక హత్య విచారణలో ఇన్ ఛార్జ్ పోలీస్ పాత్రలో కనిపించనుంది. పోలీస్ పాత్రలో మరోసారి రాధిక దుమ్ము దులపనుంది.

వివాదాలు పరమ రొటీన్ ..!

అప్పుడప్పుడు వివాదాలతో తన పేరును లైమ్ లైట్ లో ఉంచడం ఎలానో రాధిక ఆప్టేకి బాగా తెలుసు. గతంలోను పలుమార్లు ఆప్టే వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది. పరిశ్రమలో ఎదిగేందుకు.. నటిగా కొన్ని ప్రామాణిక కొలతలతో కనిపించడానికి తన ముక్కును సరిచేసుకోవాలని.. ఇంప్లాంట్స్ తో రొమ్ములను పెంచుకోవాలని ఇండస్ట్రీలో కొందరు పెద్దలు తనని కోరారని గతంలో రాధిక ఆప్టే వెల్లడించింది. కానీ తాను ఆ పనిని చేయలేదు. చేయాల్సినది చేయడం ద్వారా మాత్రమే నటిగా ఎదిగానని తెలిపింది. కెరీర్ ఆరంభంలో సినీపెద్దల నుంచి విచిత్రమైన సలహాలు విన్నానని ఆప్టే బోల్డ్ గా ఓపెనైంది.

బాలీవుడ్ లో అత్యుత్తమ నటీమణుల్లో ఒకరిగా కొనసాగుతున్న రాధికా ఆప్టే తన శక్తివంతమైన ప్రదర్శనలతో ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. అది OTT స్పేస్ అయినా పెద్ద తెర అయినా నటిగా రాజీ అన్నదే లేకుండా పని చేస్తుంది. ప్రవేశించిన ప్రతి రంగంలోనూ తానేంటో నిరూపించుకుంది. నటనలో తన ప్రదర్శనలకు మంచి సమీక్షలను కూడా పొందింది. అయితే అంత పెద్ద స్థాయి ఉన్న నటిని కూడా సర్జరీల తో సరి చేసుకోమని కొందరు సూచించారు.

షోబిజ్ వరల్డ్ లో కొందరు తనను ప్లాస్టిక్ సర్జరీలు చేయించుకోవాలని కోరినట్టు వెల్లడించారు. ఇంతకు ముందు అలాంటి ఒత్తిడి ఉండేది. పరిశ్రమకు కొత్తగా వచ్చినప్పుడు.. నా శరీరాకృతి పరంగా ముఖం పరంగా చాలా మార్పులు చేయాలని చెప్పారు. నేను మొదట కలుసుకున్నప్పుడు నా ముక్కును మార్చుకోవాలని అన్నారు. నాతో రెండవ సమావేశంలోనే మేకర్స్ ఈ మాట చెప్పారు. బూబ్ జాబ్ (స్థనాలు పెంచుకోవాలని) చేయించుకోవాలని కొందరు అడిగారు. ఆ తర్వాత నా కాళ్ల సౌందర్యం కోసం ఏదైనా చేయమని.. ఆపై నా దవడలకు ఏదైనా చేయించాలని చెప్పారు. ఇక్కడ ఎక్కడో (ఆమె చెంపలకు చూపుతూ) బోటాక్స్ ను రీఫిల్ చేయాలని కూడా చెప్పారు. ఇలా నా వెంట్రుకలకు రంగు వేయడానికి 30 సంవత్సరాలు పట్టింది.. అని సెటైరికల్ గా తనకు జరిగిన వాటిని వెల్లడించింది.

నేను కనీసం ఇంజెక్షన్ కూడా తీసుకోను. అదే నన్ను అలా చేయకుండా ఆపివేసింది. ఇతరుల కోరికల వల్ల నేను ఎప్పుడూ ఒత్తిడికి గురికాలేదు. నిజానికి నేను ఇలాంటి సలహాలిచ్చేవాళ్లపై చాలా మంటగా ఉన్నాను. ఇవన్నీ నా శరీరాన్ని మరింత ప్రేమించడంలో నాకు సహాయపడ్డాయని కూడా అంది. ఇండస్ట్రీ జనం నిరంతరం అలా అడగడం వల్ల నేను కొంచెం అలసిపోయాను.. అనారోగ్యానికి గురయ్యానని గతంలో సెటైర్లు వేసింది ఆప్టే.


Recent Random Post: