మీనాక్షి చౌదరి కెరీర్ ట్విస్ట్

Share


టాలీవుడ్‌లో మీనాక్షి చౌదరి దూసుకువచ్చి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తొలి చిత్రం ఇచట వాహనములు నిలుపరాదు డీసెంట్ హిట్ అవ్వడం ఆమెకు బలమైన ఆరంభం అయింది. గురూజీ త్రివిక్రమ్ ముందే ఈ విజయాన్ని జోస్యం చెప్పి ప్రోత్సహించడం మరింత బలాన్నిచ్చింది. ఆ తర్వాత హిట్ 2, గుంటూరు కారం వంటి సినిమాలతో వరుస అవకాశాలు దక్కించుకుంది.

అంతేకాకుండా, కోలీవుడ్‌లో కూడా అడుగుపెట్టి కోలైతో లాంచ్ అయింది. అక్కడి నుంచే దళపతి విజయ్ సరసన ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ అనే భారీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ సంపాదించుకోవడం ఆమె జోరును చూపించింది. కానీ గత ఏడాది ఆరు సినిమాల్లో ఆమె నటించినా, హిట్స్ మాత్రం రెండు మూడే కావడం కాస్త వెనక్కి లాగింది.

ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన వస్తున్నాం మంచి బ్లాక్‌బస్టర్ అయినప్పటికీ, ఆ విజయానంతరం కొత్త ప్రాజెక్టులు చేతిలో లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ప్రస్తుతం ఆమె అనగనగా ఒక రోజు చిత్రంలో నటిస్తోంది కానీ ఆ సినిమా నుండి పెద్దగా అప్‌డేట్ ఏదీ లేదు.

మీనాక్షి చౌదరి స్టార్ లీగ్‌లోకి వెళ్లేందుకు కావాల్సిన గుర్తింపు, ప్రతిభ ఉన్నా, గ్లామర్ రోల్స్‌కి దూరంగా ఉండటం వల్ల కొంతమంది దర్శకుల వద్ద అవకాశాలు కోల్పోతుందనే మాట వినిపిస్తోంది. ఇప్పుడు ఉన్న పరిస్థితిలో, ఆమె తన ఎంపికలలో సడలింపు ఇవ్వాలా? లేక తనదైన మార్గంలోనే ముందుకు సాగాలా? అన్నది ఆసక్తికరంగా మారింది.


Recent Random Post: