మురుగదాస్ బౌన్స్ బ్యాక్ అవుతాడా? ‘మదరాసి’పై సందేహాలు!

Share


మురుగదాస్… ఓప్పొప్పుడు టాప్ డైరెక్టర్లలో ఒకరు. రమణ, గజిని, తుపాకి, కత్తి లాంటి బ్లాక్‌బస్టర్లతో ఇండస్ట్రీలో హవా చూపించిన మురుగదాస్‌కు మహేష్ బాబుతో చేసిన ‘స్పైడర్’ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది. ఆ తర్వాత వచ్చిన ‘సర్కార్’, ‘దర్బార్’ కూడా భారీ నిరాశ మిగల్చాయి. దీంతో ఒకప్పుడు మురుగదాస్‌తో సినిమా చేసేందుకు పోటీ పడిన స్టార్లు ఇప్పుడు దూరంగా ఉండటాన్ని చూస్తున్నాం.

కొన్నేళ్ల పాటు కెరీర్‌లో గ్యాప్ వచ్చిన మురుగదాస్.. ఇప్పుడు వరుసగా రెండు క్రేజీ ప్రాజెక్టులను పట్టాలెక్కించారు. అందులో ఒకటి బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌తో ‘సికందర్’, మరొకటి శివకార్తికేయన్ హీరోగా తెరకెక్కుతున్న ‘మదరాసి’. అయితే ఈ రెండు సినిమాల విషయంలో ఆ హీరోల ఫ్యాన్స్ మాత్రం అసంతృప్తిగా ఉన్నారు.

ఇప్పటికే వరుస పరాజయాలతో ఇబ్బంది పడుతున్న సల్మాన్ ఖాన్.. మురుగదాస్‌తో చేసే ఈ సినిమా మరో ఫ్లాప్‌గా మారుతుందేమోనని భయపడుతున్నారు. అలాగే, సౌత్‌లో బలమైన క్రేజ్ సంపాదించుకున్న శివకార్తికేయన్ కూడా ఫామ్‌లో లేని మురుగదాస్‌తో సినిమా చేయడం వల్ల రిస్క్ తీసుకున్నాడనే టాక్ వినిపిస్తోంది. ‘అమరన్’ వంటి హిట్ ఇచ్చిన ఆయనకు ఇంకాస్త హైప్ పెరిగేలా కొత్త డైరెక్టర్‌తో సినిమా చేయాల్సిందని ఫ్యాన్స్ భావించారు. కానీ ‘సికందర్’కు వచ్చిన మిక్స్‌డ్ టాక్ చూసిన తర్వాత ‘మదరాసి’ మీద కూడా అంచనాలు తగ్గిపోతున్నాయి.

అయితే, ఇప్పటిదాకా మురుగదాస్ మళ్లీ తన ఫామ్‌లోకి రాగలడా అనే సందేహం నెలకొనగా, ‘మదరాసి’తోనైనా తన మార్క్ చూపించగలడా? అనేది ఆసక్తికరంగా మారింది. గతంలో శంకర్ కూడా ‘ఇండియన్ 2’తో ఆశలు పెంచి, ఆ తర్వాత ‘గేమ్ చేంజర్’ మీద నెగటివ్ ఇంపాక్ట్ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. మరి మురుగదాస్ ఈసారి ఎలా ప్లాన్ చేసుకున్నాడో చూడాలి!


Recent Random Post: