మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ప్రస్తుతం తన కొత్త సినిమా ‘మట్కా’తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తయింది. ఇటీవలే ఈ సినిమా టీజర్ విడుదల అయ్యే సమయాన్ని కూడా చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘మట్కా’ సినిమా నుంచి వచ్చిన ఈ అప్‌డేట్స్ వరుణ్ తేజ్ మంచి హైప్ క్రియేట్ చేశాయి.
ఇక ‘మట్కా’ సినిమా తర్వాత వరుణ్ చేయబోయే ప్రాజెక్ట్ కూడా ఇప్పుడు వార్తల్లోకెక్కింది. మేర్లపాక గాంధీ దర్శకత్వంలో మరో సినిమా చేయడానికి వరుణ్ సిద్ధమవుతున్నాడని సినీ వర్గాల్లో చర్చలు జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్ తో నిర్మించనుందని సమాచారం.
ఇకపోతే సినిమాకు ‘కనకరాజు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్లు సినీ వర్గాలు తెలియజేస్తున్నాయి. ఈ టైటిల్ కథ పరంగా కూడా ఓ ప్రత్యేకతను సొంతం చేసుకోబోతుందని సమాచారం. ఇందులో కథ ఒక భాగం కొరియాలో, మరొక భాగం రాయలసీమ నేపథ్యంలో కొనసాగనుందట. సినిమాకు సంబంధించిన యాక్షన్ సన్నివేశాలు, స్టంట్స్ కొరియాలోనే చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది. సినిమా ఓ వెరైటీ కాన్సెప్ట్ చుట్టూ తిరగనుందట.
యాక్షన్‌కి పెద్ద పీట వేసే ఈ కథ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందిస్తుందనే టాక్ వినిపిస్తోంది. కొరియా నేపథ్యం సినిమాలో ఎలా ఉపయోగించారో చూసేందుకు ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. రాయలసీమ నేపథ్యంలో తెలుగు ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యే ఎమోషన్స్ ఉంటే సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.
ఇప్పటికే కొరియన్ సినిమాలు, సిరీస్‌ల ప్రభావం ఇండియాలో ఎక్కువగా ఉంది. ప్రేక్షకులు భాష అర్థం కాకపోయినా సబ్ టైటిల్స్ ద్వారా సిరీస్‌లు, సినిమాలను ఆస్వాదిస్తూ ఉన్నారు. కొరియన్ సినిమాల ప్రాచుర్యం రోజురోజుకీ పెరుగుతుండటంతో, ఈ నేపథ్యంతో తెరకెక్కించే ఈ కొత్త సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు సృష్టిస్తోంది. ఇది వరకు తెలుగులో కొరియన్ సినిమాల కొన్ని కాన్సెప్ట్స్ ఎత్తుకొచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి.
కానీ దర్శకుడు గాంధీ మాత్రం ఈ సారి సినిమా మొత్తం కొరియన్ నేపథ్యాన్ని కేంద్రంగా తీసుకుని రూపొంధిస్తుండడం విశేషం. ఈ దసరాకు ఈ చిత్రానికి సంబంధించి ఓ కీలక అప్‌డేట్ విడుదల చేయనున్నారు. ఈ అప్‌డేట్‌తో పాటు, సినిమాలో ప్రధాన నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరు అనేది కూడా ప్రకటించనున్నారు. వరుణ్ తేజ్ పట్ల అభిమానుల్లో ఉన్న అంచనాలను దృష్టిలో పెట్టుకుని మేకర్స్ ఈ సినిమాను రూపొందించినున్నట్లు సమాచారం.
Recent Random Post: