మే 1 క్లాష్: హిట్ 3 vs రెట్రో – నాని దూకుడు

Share


మే 1 విడుదలకు సిద్ధమవుతున్న రెండు చిత్రాలు – హిట్ 3: ది థర్డ్ కేస్ మరియు రెట్రో – తాము తాము ప్రత్యేకమని నిరూపించుకునేందుకు రంగంలోకి దిగాయి. అయితే ప్రమోషన్ పరంగా చూస్తే నాని నిర్మాణం హిట్ 3 స్పష్టమైన ఆధిక్యతను ప్రదర్శిస్తోంది.

నాని ఇప్పటికే హైదరాబాద్‌లో మీడియా ఇంటర్వ్యూలు ముగించి, ముంబైలో నేషనల్ మీడియాతో ముఖాముఖీలు నిర్వహిస్తున్నాడు. అదే సమయంలో టాలీవుడ్ మీడియాకు వీడియో ఇంటర్వ్యూలు ముందుగానే ఇచ్చి రెండు ఫ్రంట్‌లను ఒకేసారి టార్గెట్ చేసిన పద్దతి విశేషంగా పనిచేస్తోంది. చివరిగా మిగిలింది ప్రీ రిలీజ్ ఈవెంట్ మాత్రమే. ఈ వారం జరగబోయే ఈ ఈవెంట్‌కి నాని స్పెషల్ టచ్ ఇవ్వనున్నట్టు టాక్ వినిపిస్తోంది.

డైరెక్టర్ శైలేష్ కొలను ట్రైలర్‌లో కథను పూర్తిగా బయటపెట్టకుండా తీసుకున్న జాగ్రత్తలు థియేటర్లలో ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి. కానీ ఇప్పటివరకు ట్రైలర్‌కు పాజిటివ్ రెస్పాన్స్ వచ్చిన విషయం గమనార్హం.

ఇక రెట్రో విషయానికి వస్తే, ప్రమోషన్‌లో కొంత వెనుకబడినట్టే ఉంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడంతో కొన్ని అంచనాలు ఉన్నప్పటికీ, ట్రైలర్ కట్ ప్రేక్షకులను క్లారిటీలోకి తీసుకురాలేకపోయింది. మాస్ ఆడియన్స్‌కు అసలు మూవీ కాన్సెప్ట్ పూర్తిగా అర్థం కాలేదు. అయితే డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ మీద ఆశలు కొనసాగుతున్నాయి. పూజా హెగ్డే గ్లామర్ తో సోషల్ మీడియాలో రెట్రో పాపులారిటీ కొంత పెరుగుతోంది కానీ అది బాక్సాఫీస్‌పై ఎంత ప్రభావం చూపుతుందో చెప్పలేం.

గతంలో ‘కంగువ’ డిజాస్టర్ నేపథ్యంలో రెట్రో ఎలాంటి మేజిక్ చేస్తుందో వేచి చూడాల్సిందే. ఈ మే 1 క్లాష్‌లో ఎవరు వసూళ్ల వర్షం కురిపిస్తారో త్వరలో తేలనుంది.


Recent Random Post: