అతడు స్టార్ గా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇప్పుడిప్పుడే పెద్ద స్థాయికి చేరుకుంటున్నాడు. బ్యాక్ టు బ్యాక్ క్రిటిక్స్ ప్రశంసలు పొందిన చిత్రాలతో నటుడిగాను తనదైన ముద్ర వేసి భారీగా ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. దేశవ్యాప్తంగా అతడి ప్రతిభ గురించి చర్చ సాగుతోంది. అతడు కూడా ఇతర అగ్ర హీరోల స్థాయిలో పారితోషికాలు అందుకోవాల్సిన సమయమిది. జీవితాంతం శ్రమించిన దానికి ఫలితం దక్కాల్సిన టైమ్ వచ్చింది. కానీ అనూహ్యంగా అతడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు విమర్శలకు తావిచ్చింది. తన కుటుంబం కోసం 2025 లో నటన నుంచి వైదొలుగుతున్నానని అతడు ప్రకటించాడు. ఈ ప్రకటన నిజంగా అభిమానులను షాక్ కి గురి చేసింది. చాలామంది ప్రముఖులను ఆశ్చర్యపరిచింది.
స్టార్ డమ్ దిశగా అడుగులు వేస్తున్నాడు. పెద్ద స్థాయికి ఎదిగేస్తున్నాడు. ఇతర స్టార్లలానే అతడు కూడా 30 కోట్లు, 50 కోట్లు అంటూ పారితోషికాలు అందుకునే ఛాన్సుంది.. కానీ ఇంతలోనే రిటైర్‌మెంట్ ప్రకటించాడేమిటి? అంటూ ఆరాలు మొదలయ్యాయి. ఇదంతా ఎవరి గురించి అంటే.. ప్రముఖ బాలీవుడ్ నటుడు విక్రాంత్ మాస్సే గురించి…37 వయసుకే అతడు నటన నుంచి వైదొలుగుతానని ప్రకటించడం చర్చగా మారింది.
ఆయన ఎక్స్ లో ఇలా రాసారు. 2008లో హన్సల్ మెహతా చిత్ర పరిశ్రమను అలాగే ముంబైని విడిచిపెట్టాడు. తన కుటుంబం సహా అతడు లోనావాలాలోని మలావాలి అనే చిన్న గ్రామానికి మారాడు. అతడు మళ్లీ వచ్చాడు. తనను తాను ఆవిష్కరించుకున్నాడు. 2012లో షాహిద్‌తో తన కెరీర్ తిరిగి ప్రారంబించాడు. బెస్ట్ ఎన్నడూ వెనక్కి తిరిగి చూడలేదు! అని తెలిపారు. సినీరంగంలోని వ్యక్తులకు కెరీర్ తో పాటు కుటుంబాన్ని చూసుకోవాల్సిన ఆవశ్యకతను కూడా గుప్తా గుర్తు చేసారు. ఈ నిర్ణయానికి రావడానికి విక్రాంత్ ధైర్యంగా ఉన్నందుకు గుప్తా ప్రశంసించారు. పోటీ, అభద్రత, అసూయ వంటివి ఏల్తున్న ఈ కాలంలో విరామం తీసుకుని తన విధులపై దృష్టి పెట్టడానికి ఒక నటుడికి ధైర్యం అవసరం. ఒక తండ్రిగా, భర్తగా, కుమారుడిగా అతడు తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించకూడదు అని అన్నారు.
అయితే నెటిజనుల్లో కొందరు తన చిత్రానికి మార్కెటింగ్ స్ట్రాటజీ అని అనుమానిస్తున్నారు. మరికొందరు రాజకీయ ఒత్తిడి వల్ల జరిగిందా? అని ప్రశ్నించారు. చాలావరకు రాబోయే ప్రాజెక్ట్ కోసం మార్కెటింగ్ పద్దతి ఉంటుంది. తద్వారా ప్రజలు థియేటర్‌లో సినిమాను చూడటానికి ఆసక్తిగా ఉంటారు. తర్వాత అతడు ప్రకటనను మారుస్తాడు. రిలాక్స్ .. అని ఒకరు వ్యాఖ్యానించారు.
Recent Random Post: