
సూపర్ స్టార్ రజనీకాంత్ తాజా చిత్రం కూలీ బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో నిలవలేకపోయింది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాపై రిలీజ్‌కు ముందే భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా నాగార్జున, ఉపేంద్ర, ఆమిర్ ఖాన్ వంటి స్టార్ నటులు నటించడంతో హైప్ మరింత పెరిగింది. ట్రేడ్ వర్గాలు ఈ సినిమా రూ.1000 కోట్లకు పైగా వసూలు చేస్తుందని భావించాయి.
కానీ విడుదల తర్వాత పరిస్థితి పూర్తిగా మారింది. కలెక్షన్లు అంచనాలకు చాలా దూరంగా ఉన్నాయి. ఆగస్టు 14న విడుదలైన కూలీ, 12 రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని భాషల్లో కలిపి రూ.259.97 కోట్ల నెట్ కలెక్షన్లు, రూ.306.64 కోట్ల గ్రాస్ సాధించింది. ఈ అంకెలు బ్రేక్ ఈవెన్‌కి చాలా దూరంగా ఉండటంతో సినిమా ఫ్లాప్‌గా మారినట్టే అని విశ్లేషకులు చెబుతున్నారు.
అయితే, ఒక ఆసక్తికర అంశం ఏమిటంటే, మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ కూలీ తమిళనాడులో టాప్ వసూళ్లు సాధించిన 4 సినిమాల జాబితాలో చేరబోతోంది. ప్రస్తుతం పొన్నియన్ సెల్వన్-1 ను దాటేందుకు కేవలం రూ.6 కోట్ల దూరంలో మాత్రమే ఉంది. రాబోయే వారం చివర్లో ఈ రికార్డును సులభంగా దాటే అవకాశం ఉంది.
కానీ ఓవర్సీస్‌లో మాత్రం సినిమా బాగా దెబ్బతింది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో డిస్ట్రిబ్యూటర్లకు దాదాపు 1 మిలియన్ డాలర్ల నష్టం వచ్చినట్లు సమాచారం. దీంతో కూలీ గ్లోబల్ లెవెల్‌లో ఫ్లాప్ అనిపించుకుంది.
అయినా సరే, రజనీకాంత్ ప్రభావం కోలీవుడ్‌లో అలాగే కొనసాగుతోంది. ఆయన గత చిత్రాలు 2.0 మరియు జైలర్ ఇప్పటికీ తమిళ్ సినిమా చరిత్రలో అత్యధిక వసూళ్లు సాధించిన తొలి రెండు స్థానాల్లో ఉన్నాయి. గ్యాంగ్‌స్టర్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన కూలీలో నాగార్జున నెగిటివ్ రోల్‌లో కనిపించగా, సినిమా రిలీజ్ రోజే మిశ్రమ స్పందన రావడంతో కలెక్షన్లపై ప్రతికూల ప్రభావం పడింది.
Recent Random Post:















