
సూపర్ స్టార్ రజినీకాంత్ చలనచిత్ర ప్రమోషన్‌లకు తనదైన శైలిలో హాస్యంతో, సరళతతో ఆకట్టుకుంటూ ఉంటారు. చెన్నైలో జరిగిన ‘కూలీ’ ప్రమోషనల్ ఈవెంట్‌లో ఆయన మరోసారి అదే మంత్రాన్ని పాటించారు. సినిమా దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇచ్చిన ఇంటర్వ్యూల గురించి వ్యాఖ్యానిస్తూ, రజినీ తన మార్క్ హ్యూమర్‌తో ఆడిటోరియంను నవ్వులతో ముంచెత్తారు.
రెండు గంటల 10 నిమిషాల పాటు సాగిన లోకేష్ ఇంటర్వ్యూను చూసిన అనుభవాన్ని ఆయన వినోదాత్మకంగా పంచుకున్నారు. “కూర్చుని, నిలబడి, తిరుగుతూ చూశా.. పడుకుని లేచిన తర్వాత కూడా ఇంటర్వ్యూ ఆగలేదు” అంటూ రజినీ చేసిన వ్యాఖ్యలపై ఆహ్లాదకరమైన ప్రతిస్పందన వచ్చింది.
అలాగే, కథ చెప్పేందుకు వచ్చినప్పుడు లోకేష్ తనను “కమల్ హాసన్ ఫ్యాన్”నని చెప్పిన దృశ్యాన్ని హాస్యంగా గుర్తు చేస్తూ, అది కథ శైలికి ముందస్తు హింట్‌లా మారిందని రజినీ వివరించారు.
ఈ సందర్భంగా ఆయన తన జీవితంలోని ఒక ఎమోషనల్ ముమెంటును కూడా పంచుకున్నారు. ఒకప్పుడు కూలీగా పని చేసిన అనుభవాన్ని గుర్తు చేస్తూ, ఒక వ్యక్తి తనకు రెండు రూపాయలు టిప్ ఇచ్చిన ఘటనను చెప్పారు. ఆ వ్యక్తి తను చదువుకున్న కాలేజీ క్లాస్‌మేట్ కావడం తెలుసుకున్న తర్వాత ఆ సంఘటన తన మనసును తాకిందని అన్నారు.
ఈవెంట్ మొత్తం రజినీ హాస్యంతో, హృద్యతతో నిండిన వేడుకగా నిలిచింది.
Recent Random Post:















