
ఇటీవల వరుస పరాజయాలతో జోరు కోల్పోయిన బాలీవుడ్ స్టార్ హీరో రణ్ వీర్ సింగ్ ప్రస్తుతం తన కెరీర్‌ను గట్టిగా తిరిగిరావాలన్న పట్టుదలతో శతవిధాలా ప్రయత్నాలు చేస్తున్నాడు. బాలీవుడ్లో విజయాలేమీ దక్కకపోవడంతో, దక్షిణాది దర్శకులతో కలిసి పాన్ ఇండియా స్థాయిలో విజయం సాధించాలని అనుకున్నాడు. మొదటగా శంకర్ దర్శకత్వంలో “అన్నియన్” (తెలుగులో “అపరిచితుడు”) రీమేక్ చేయాలనుకున్నా, మిడ్ వె లో ప్రాజెక్ట్ డ్రాప్ అయ్యింది. ఆపై తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మతో కలిసి సినిమా చేయాలన్న వార్తలు వినిపించాయి కానీ, దానికి సంబంధించి ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఈ నేపథ్యంలో రణ్ వీర్ మళ్లీ బాలీవుడ్ దృష్టిపెట్టాడు. ప్రస్తుతం ఆయన చేతిలో సుమారు ₹1000 కోట్ల విలువైన భారీ ప్రాజెక్టులు ఉన్నాయి. “యూరి” ఫేమ్ ఆదిత్య ధార్ దర్శకత్వంలో రూపొందుతున్న స్పై యాక్షన్ థ్రిల్లర్ **”ధురంధర్”**లో నటిస్తున్నాడు. ఈ చిత్రం దాదాపు ₹150 కోట్లు బడ్జెట్‌తో రూపొందుతోంది. ఆ తర్వాత ఫర్హాన్ అక్తర్ దర్శకత్వంలో “డాన్ 3” అనే ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లో నటించనున్నాడు. దీని బడ్జెట్ సుమారు ₹300 కోట్లు అని టాక్.
ఇంతకుముందు విజయాలు సాధించిన మడాక్ ఫిలింస్‌తో రణ్ వీర్ మరో హారర్ ప్రాజెక్ట్ చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇది ₹200 కోట్లు బడ్జెట్‌తో ఉండబోతుందట. అయితే దీనిపై అధికారిక ప్రకటన మాత్రం రావాల్సి ఉంది. అంతేకాక, రణ్ వీర్ మెహబూబ్ స్టూడియోస్‌లో గట్టి భద్రత నడుమ ఓ సీక్రెట్ ప్రాజెక్ట్ షూటింగ్లో పాల్గొన్నట్టు వార్తలు వచ్చాయి. ఇది కూడా మరో భారీ బడ్జెట్ మూవీ అయి ఉండొచ్చన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.
ఇలా చూస్తే రణ్ వీర్ ప్రస్తుతం ₹1000 కోట్ల వరకు విలువైన భారీ ప్రాజెక్టులకు లీడ్ చేస్తున్నాడు. గతంలో వచ్చిన అర్ధ డజను ఫ్లాపుల తర్వాత, ఇప్పుడు ఎలాంటి పొరపాట్లకు తావు లేకుండా ప్రతి స్క్రిప్ట్‌ను ఆచితూచి, విజయాన్ని టార్గెట్ చేస్తూ ముందుకెళ్తున్నాడు. హిట్ ఇచ్చిన దర్శకులు, ప్రముఖ నిర్మాణ సంస్థల చుట్టూనే తిరుగుతూ తన కంబ్యాక్‌ను పక్కాగా ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతానికి అతను “ధురంధర్” చిత్రీకరణలో బిజీగా ఉన్నాడు. ఇందులో అర్జున్ రాంపాల్, సంజయ్ దత్, అక్షయ్ ఖన్నా, ఆర్ మాధవన్ వంటి భారీ తారాగణం నటిస్తున్నారు. ఇది నిజ జీవిత గూఢచారి కథ ఆధారంగా రూపొందుతోందన్న సమాచారం నేపథ్యంలో, రణ్ వీర్ ఈ సినిమాపై భారీ ఆశలు పెట్టుకున్నాడు.
Recent Random Post:















