రష్మిక చెన్నై వ్యాఖ్యపై కన్నడ నెటిజన్ల ఆగ్రహం

Share


స్టార్ హీరోయిన్ రష్మిక ప్రస్తుతం తన కెరీర్‌లో ఫుల్ జోష్‌లో దూసుకుపోతున్నారు. నార్త్ నుండి సౌత్ వరకూ వరుస సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఈ మధ్య షూటింగ్స్, ప్రమోషన్స్‌తో నాన్ స్టాప్‌గా బిజీగా గడుపుతున్నారు. ఇప్పుడు ఆమె నటించిన కుబేర చిత్రం జూన్ 20వ తేదీన వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది.

ఈ పాన్ ఇండియా ప్రాజెక్టులో కోలీవుడ్ స్టార్ ధనుష్, టాలీవుడ్ కింగ్ నాగార్జున లీడ్ రోల్స్ చేస్తున్నారు. రష్మిక ఫీమేల్ లీడ్ పాత్రలో కనిపించనున్నారు. పాన్ ఇండియా మూవీ కావడంతో మేకర్స్ భారీగా ప్రమోట్ చేస్తున్నారు. రష్మిక కూడా ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంటూ సినిమాకు మంచి హైప్ తెస్తున్నారు.

ఇటీవలి చెన్నైలో జరిగిన ఈవెంట్‌లో రష్మిక ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. ప్యాస్టెల్ కలర్ డ్రెస్‌లో మెరిసిన ఆమె, తన గ్లామర్‌తో అందర్నీ ఆకట్టుకున్నారు. ఈ సందర్భంగా తన బాల్యానుభవాలను సోషల్ మీడియాలో పంచుకుంటూ, చెన్నైపై తన ప్రేమను వ్యక్తపరిచారు.
“కుబేర ప్రమోషన్లను చెన్నైలో ప్రారంభించాం. నాకు తెలిసిన చాలా మంది తెలుసు — నా బాల్యం చెన్నైలో గడిచింది. అందుకే చెన్నై నా హృదయంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది. అద్భుతమైన సాయంత్రం!” అని రష్మిక పేర్కొన్నారు. అదే సమయంలో, కుబేర టీమ్ అందించిన మ్యాజిక్ కోసం ఎదురు చూడాలని కోరారు.

అయితే రష్మిక చేసిన ఈ వ్యాఖ్యలు కొందరు కన్నడ నెటిజన్లను అసంతృప్తికి గురి చేశాయి. అసలు ఆమె పుట్టి పెరిగింది కర్ణాటకలోనే కదా, చెన్నైలో బాల్యం గడిచిందని ఎలా అంటారు? అని వారు ప్రశ్నిస్తున్నారు. గతంలో కూడా రష్మిక కాంతార చూడలేదని చెప్పి ట్రోలింగ్‌కు గురయ్యారు. తర్వాత హైదరాబాద్ తనకు ఇల్లు లాంటిదని చెప్పినప్పుడు విమర్శలు ఎదురయ్యాయి. ఇప్పుడు చెన్నై గురించి చేసిన వ్యాఖ్యలపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై రష్మిక ఎలా స్పందిస్తారో చూడాలి.


Recent Random Post: