
రష్మిక మందన్న, దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న “ది గర్ల్‌ఫ్రెండ్” సినిమా విడుదల తేదీ దగ్గర పడుతున్నకొద్దీ ప్రేక్షకుల్లో ఆసక్తి మరింత పెరుగుతోంది. నవంబర్ 7న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహిస్తున్నారు. రీసెంట్‌గా రిలీజ్ అయిన ట్రైలర్‌లో రొమాంటిక్ లవ్ స్టోరీకి తోడు డార్క్, ఇంటెన్స్ ఎమోషన్ కనిపించడంతో మూవీపై క్యూరియాసిటీ మరింత పెరిగింది.
దీనిపై దర్శకుడు రాహుల్ రవీంద్రన్ ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. “ట్రైలర్ ద్వారా ఆడియెన్స్‌ను కొంత మిస్ డైరెక్ట్ చేశాం. అసలు కథ వేరే డైరెక్షన్‌లో ఉంటుంది. ట్రైలర్‌లో మీరు చూసిన ఆ ఇంటెన్స్ డ్రామా సెకండాఫ్‌లో ఉంటుంది, అది ప్రేక్షకులకు నిజమైన సర్ప్రైజ్ అవుతుంది,” అని ఆయన అన్నారు.
అలాగే ఈ కథకు తన కాలేజీ రోజులలో చూసిన ఒక సంఘటన, అలాగే ఒక పాట ప్రేరణగా నిలిచాయని రాహుల్ తెలిపారు. “ఇది ఒక ప్రేమ జంట జీవితంలో జరిగిన వాస్తవ సంఘటనలకు దగ్గరగా ఉంటుంది. కానీ ఇందులో ఎలాంటి నీతులు లేదా సందేశాలు లేవు. ఇది కేవలం మనసుని తాకే ఎమోషనల్ జర్నీ మాత్రమే,” అని చెప్పారు.
మొదట ఈ ప్రాజెక్ట్‌ను ‘ఆహా’ ఓటీటీలో చేయాలనుకున్నా, కథ విన్న గీతా ఆర్ట్స్ అధినేత అల్లు అరవింద్ గారు, “ఇది ఓటీటీకి కాదు, థియేటర్లో చూడదగిన సినిమా,” అని చెప్పడంతో సినిమా థియేట్రికల్ ప్రాజెక్ట్‌గా మారిందని తెలిపారు.
రష్మిక స్క్రిప్ట్ చదివిన రెండు రోజుల్లోనే ఫోన్ చేసి, “ఈ కథ ఒక అమ్మాయిగా నాకు చాలా కనెక్ట్ అయింది. ఇది అన్ని అమ్మాయిలకు నేను ఇస్తున్న బిగ్ హగ్‌లాంటిది,” అని చెప్పి వెంటనే ఒప్పుకుందని రాహుల్ చెప్పారు.
సమంత ఇచ్చిన సలహా గురించి కూడా ఆయన షేర్ చేశారు — “నేను ఈ కథను సమంతకు చూపించాను. ఆమె చదివి, ఈ పాత్ర కొత్త హీరోయిన్ చేయడం బాగుంటుందని సూచించింది. ఆ సలహా నాకు చాలా హెల్ప్ అయింది,” అని చెప్పారు.
‘యానిమల్’ సినిమా సమయంలో రష్మిక ఇచ్చిన సపోర్ట్ గురించి కూడా ఆయన ప్రస్తావించారు. “యానిమల్ వందల కోట్ల వసూళ్లు సాధిస్తుంటే, నా సినిమా చిన్నదిగా అనిపించింది. కానీ రష్మికే నాకు ధైర్యం చెప్పింది. ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నిజాయితీగా ఉండాలి, రియల్‌గా ఫీల్ అయ్యేలా చేయాలి అని ప్రోత్సహించింది,” అని రాహుల్ రవీంద్రన్ చెప్పారు.
Recent Random Post:














