
ఈ సంవత్సరం అనుకోకుండా కొన్ని ఘోరమైన ఘటనలు చోటుచేసుకున్నాయి – ప్రయాగ్‌రాజ్ తొక్కిసలాట, పహల్గామ్ దాడి, బెంగళూరులో జరిగిన ప్రమాదం, ఇంకా ఇటీవల ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం – ఇవన్నీ మానవ జీవితంలోని అనిశ్చితిని రుజువు చేస్తున్నాయన్నట్లుగా ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న తన సోషల్ మీడియా ద్వారా ఓ భావోద్వేగపూరితమైన సందేశాన్ని షేర్ చేసింది.
సినిమాల బ్యాక్ టూ బ్యాక్ షూటింగ్‌లతో బిజీగా ఉన్నా రష్మిక ఎప్పుడూ ఫ్యాన్స్‌తో సోషల్ మీడియా ద్వారా టచ్‌లో ఉంటుంది. తాజాగా ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది. “జీవితంలో మనకు ఎంత సమయం మిగిలి ఉందో తెలియదు. అందరూ కలిసి ఉండడం నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. సమయం చాలా సున్నితమైనది, మనమూ అంతే. భవిష్యత్తు ఎవరూ ఊహించలేరు. కాబట్టి దయచేసి ఒకరిపై ఒకరు దయగా ఉండండి. మీ పట్ల మీరు కూడా మృదువుగా ఉండండి” అని రష్మిక తెలిపింది.
ఇది మొదటిసారి కాదు. ఫిబ్రవరిలో కూడా రష్మిక ఇదే అంశంపై ఓ పోస్టు చేశారు. “ఈ రోజుల్లో మనుషుల్లో దయ తగ్గిపోతోంది. నేను అందరినీ ఒకేలా చూస్తాను. మీరందరూ ఒకరిపై ఒకరు దయతో ఉండండి” అని అప్పట్లో రాసింది. ఇప్పుడు మళ్లీ అదే భావనను ఆమె వ్యక్తీకరించడం గమనార్హం.
కెరీర్ విషయానికొస్తే, రష్మిక ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్‌తో కలిసి నటించిన కుబేర సినిమాతో వస్తోంది. జూన్ 20న విడుదల కానున్న ఈ సినిమా తనకు ఎంతో స్పెషల్ అని, నటి గా కొత్తగా చాటుకునే పాత్రలో నటించానని చెబుతుంది. “ఇంతకు ముందు ఎప్పుడూ ఇలా నటించలేదు. కుబేర సినిమా అందరికీ నచ్చుతుంది” అంటూ ఆశాభావం వ్యక్తం చేసింది.
Recent Random Post:















