
తమిళ స్టార్ హీరో ధనుష్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన “కుబేర” మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో సునీల్ నారంగ్, పుస్కూర్ రామ్మోహన్ రావు సంయుక్తంగా ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను నిర్మించారు. ఈ చిత్రంలో కింగ్ నాగార్జున ముఖ్య పాత్రలో నటించగా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న తొలిసారి ధనుష్‌కు జోడీగా నటించడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
ఈ సినిమా జూన్ 20న గ్రాండ్ గా విడుదల కానుండగా, ప్రమోషన్స్‌ను జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే ఆదివారం హైదరాబాద్‌లో గ్రాండ్ ప్రీ-рిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ కార్యక్రమానికి ధనుష్, నాగార్జున, రష్మికలు హాజరయ్యారు. ప్రస్తుతం రష్మిక కూడా ప్రమోషన్స్‌లో ఫుల్ యాక్టివ్‌గా పాల్గొంటోంది.
ఈ వేడుకలో యాంకర్ సుమ హాజరైన స్టార్స్ అందరినీ రాండమ్ ప్రశ్నలతో పరీక్షించింది. నాగార్జునలో ఏమి ఆకర్షణగా అనిపించిందని అడిగితే, రష్మిక “అయన ఛార్మ్” అని సమాధానమిచ్చింది. ఇక ధనుష్ విషయానికి వస్తే డైరెక్షన్, రైటింగ్, సింగింగ్, మ్యూజిక్ కంపోజింగ్ వంటి ప్రతిభను తీసుకుంటానని చెప్పింది. అల్లు అర్జున్ గురించి అడిగితే “అయన స్వాగ్” అని అన్నారు.
చివరగా, విజయ్ దేవరకొండ గురించి ఏది ఇష్టమని సుమ ప్రశ్నించగా — “ఎవ్రీథింగ్… మొత్తం తీసుకుంటాను” అంటూ నవ్వుతూ సమాధానం చెప్పింది. ఈ సమాధానంతో ఆడిటోరియం మొత్తం హుషారుగా మారిపోయింది. రష్మిక ఈ వ్యాఖ్యలతో విజయ్ దేవరకొండతో తన బంధం గురించి పరోక్షంగా క్లారిటీ ఇచ్చినట్టే అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఇప్పటికే వీరిద్దరి ప్రేమ విషయం హాట్ టాపిక్‌గా మారిన నేపథ్యంలో, వారి స్పెషల్ వెకేషన్ ఫొటోలు కూడా అప్పుడప్పుడు వైరల్ అవుతూ ఉంటున్నాయి. తాజా వ్యాఖ్యలతో రౌడీ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు.
Recent Random Post:















