రాజమౌళి చాలా ప్రయత్నించినా అక్కడకి వెళ్లనివ్వలేదట

సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్రా తాజాగా చేసిన ఒక ట్వీట్ సినీ ప్రేమికుల దృష్టిని ఆకర్షించింది. సింధు లోయ నాగరికత మరియు అప్పటి సంస్కృతి మరియు సాంప్రదాయాలకు సంబంధించిన ఫోటోలను ఆనంద్ మహీంద్రా షేర్ చేయడంతో పాటు రాజమౌళిని ట్యాగ్ చేసి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఆ ఫోటోలను గురించి ఆనంద్ మహీంద్ర తన ట్వీట్ లో… ఇవి చరిత్ర ను ఎప్పటికి నిలిచి పోయేలా చేశాయి. మన ఊహలకు సైతం అందని అద్భుతమైనవి సింధు నాగరికత సమయంలో ఉన్నట్లుగా ఆయన పేర్కొన్నారు. ఇలాంటి అద్భుతాలను మరింత మంది జనాలకు తెలిసే విధంగా రాజమౌళి ఒక సినిమాను రూపొందిస్తే బాగుంటుంది అన్నట్లుగా ఆయన తన ట్వీట్ లో పేర్కొన్నాడు.

ఆనంద్ మహీంద్ర ట్వీట్ కి రాజమౌళి స్పందించాడు. మీరు అన్నది నిజం సార్.. మగధీర షూటింగ్ కోసం తాము ధోలావీరా కి వెళ్లాము. అక్కడ ఒక పురాతనమైన చెట్టును చూశాను. అది అత్యంత పురాతనమైనది కావడం వల్ల శిలాజం గా మారింది. అప్పుడే నాకు సింధు నాగరికత యొక్క పెరుగుదల మరియు పతనం గురించి ఆలోచన వచ్చింది.

సింధు నాగరికత గురించి మరింతగా తెలుసుకునేందుకు ఒకసారి పాకిస్తాన్ లో పర్యటించాను. అప్పుడు నాకు మొహెంజొదారో ను సందర్శించడానికి అనుమతి దక్కలేదు. నేను అక్కడ పర్యటించేందుకు చాలా ప్రయత్నించాను. కానీ అక్కడి అధికారులు అనుమతి ఇవ్వలేదని రాజమౌళి పేర్కొన్నాడు.

రాజమౌళి ప్రస్తుతం పాన్ వరల్డ్ డైరెక్టర్ కనుక మొహెంజొదారో ను సందర్శించేందుకు అనుమతి దక్కవచ్చు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రాజమౌళి ఇప్పుడు సందర్శించి.. సినిమా గురించి ఆలోచించాలని అభిమానులు కోరుకుంటున్నారు. ఆనంద్ మహీంద్రా మాత్రమే కాకుండా ఇప్పుడు కోట్లాది మంది సింధు లోయ నాగరికత గురించి రాజమౌళి చూపించాలని కోరుకుంటున్నారు.


Recent Random Post: