రాజాసాబ్.. ఓ సెంటిమెంట్ ఉంది!

డార్లింగ్ ప్రభాస్ ఇప్పుడు టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు హాట్ టాపిక్ గా మారిపోయాడు. మేగ్జిమమ్ మెయిన్ స్ట్రీమ్ నుంచి సోషల్ మీడియా వరకు అంతటా ప్రభాస్ ఇమేజ్ గురించి చర్చ జరుగుతూ ఉంది. కల్కి 2898ఏడీ మూవీతో బ్లాక్ బస్టర్ అందుకున్న యంగ్ రెబల్ స్టార్ నెక్స్ట్ వరుసగా ఐదు సినిమాలు లైనప్ లో పెట్టాడు. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ తో బియాండ్ ది బౌండరీ అనేలాంటి కథలతోనే తెరకెక్కనున్న మూవీస్ కావడం విశేషం.

దర్శకులు కూడా ప్రభాస్ లాంటి స్టార్స్ కారణంగా అవుట్ ఆఫ్ ది బాక్స్ లో కథలు చెప్పాలని అనుకుంటున్నారు. అలాగే అంతకుమించి క్రియేటివ్ ఇమాజినేషన్ తో కథలను డిజైన్ చేస్తున్నారు. దీంతో కొత్తదనం ఉన్న సన్నివేశాలని ప్రేక్షకులు చూడగలుగుతున్నారు. ఇదిలా ఉంటే డార్లింగ్ ప్రభాస్ నుంచి నెక్స్ట్ ది రాజాసాబ్ మూవీ థియేటర్స్ లోకి రానుంది. 2025 ఏప్రిల్ 10న ఈ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. తాజాగా మూవీ గ్లింప్స్ ని రిలీజ్ చేయగా దానికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.

చాలా కాలం తర్వాత ప్రభాస్ ని రొమాంటిక్ హీరో లుక్ లో ప్రేక్షకులు చూస్తున్నారు. మిస్టర్ పెర్ఫెక్ట్ చిత్రంలో ప్రభాస్ కాస్త రొమాంటిక్ లుక్ లో కనిపించాడు. అలాగే సినిమాలో మంచి ఫన్ కూడా క్రియేట్ చేశాడు. బుజ్జిగాడు, ఏక్ నిరంజన్, డార్లింగ్, మిస్టర్ పెర్ఫెక్ట్ సినిమాలలో ప్రభాస్ మంచి కామెడీ జెనరేట్ చేశారు. తరువాత అతను ఎక్కువ సీరియస్ కథలు చేస్తూ వచ్చాడు.

అయితే పాన్ ఇండియా స్టార్ గా ఉన్న ఇప్పుడు ది రాజాసాబ్ సినిమాతో కామెడీ ప్రయత్నం చేస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ కి మరో ఇంటరెస్టింగ్ సెంటిమెంట్ కూడా కనెక్ట్ అయ్యింది. ప్రభాస్ కెరియర్ లో అత్యధిక సినిమాలు ఏప్రిల్ నెలలోనే రిలీజ్ అయ్యాయి. పౌర్ణమి, మున్నా, బిల్లా, డార్లింగ్, మిస్టర్ పెర్ఫెక్ట్, బాహుబలి 2.. సినిమాలు ఏప్రిల్ నెలలోనే రిలీజ్ కావడం విశేషం. మున్నా, పౌర్ణమి మాత్రమే కమర్షియల్ గా ఫ్లాప్ అయ్యాయి. మిగిలిన సినిమాలు అన్ని సూపర్ హిట్ గా నిలిచాయి.

ది రాజాసాబ్ కూడా ఏప్రిల్ నెలలోనే రిలీజ్ కాబోతోంది. ప్రభాస్ సక్సెస్ సెంటిమెంట్ వర్క్ అవుట్ అయితే ది రాజాసాబ్ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ కావడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తోంది. పౌర్ణమి, మున్నా కమర్షియల్ ఫెయిల్యూర్ అయిన ఆయన కెరియర్ లో మంచి చిత్రాలలో అవి కూడా ఉంటాయి. ఏ విధంగా చూసుకున్న ఈ సెంటిమెంట్ కరెక్ట్ గా ది రాజాసాబ్ కి మూవీకి కలిసొస్తే ప్రభాస్ ఖాతాలో హ్యాట్రిక్ హిట్ చేరడం ఖాయం అని సినీ విశ్లేషకులు అంటున్నారు.


Recent Random Post: