రాధికా అప్టేకు అందరిలా సర్జరీలు అవసరం లేదట!

బాలీవుడ్ లో వున్న హీరోయిన్ లలో మోస్ట్ టాలెంటెడ్ హీరోయిన్ రాధికా ఆప్టే. నటనకు ప్రాధాన్యత వున్న పాత్రలకు మాత్రమే ప్రాధాన్యత నిస్తూ బోల్డ్ క్యారెక్టర్లలోనూ నటించడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని నిరూపించుకున్న నటి ఆమె. బోల్డ్ క్యారెక్టర్ల ద్వారా నిత్యం వార్తల్లో నిలిచి వైరల్ అయిన రాధికా ఆప్టే తాజాగా ఇండస్ట్రీలో వున్న చాలా మంది హీరోయిన్ ల సర్జీలపై సర్జరీలపై తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది. రాధాకా అప్టే నటించిన లేటెస్ట్ ‘మోనిక ఓ మై డార్లింగ్’.

‘విక్రమ్ వేద’ రీమేక్ తరువాత రాధికా ఆప్టే నటించిన మూవీ ఇది. రాజ్ కుమార్ రావు హీరోగా నటించిన ఈ మూవీలో రాధికా ఆప్టేతో పాటు హుమా ఖురేషీ కూడా ఓ హీరోయిన్ గా నటించింది. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ మూవీని వాసన్ బాల రూపొందించాడు. నవంబర్ 11 నుంచి ఈ మూవీ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సందర్భంగా ప్రయోషన్స్ లో పాల్గొంటున్న రాధికా ఆప్టే పలు ఆసక్తికర విఝయాల్ని వెల్లడించింది. అంతే కాకుండా బాలీవుడ్ లో వున్ ఏజ్ ఇజమ్ పై అవకాశాల కోసం.. అందం కోసం హీరోయిన్ ల సర్జరీలపై సంచలన వ్యాఖ్యలు చేసింది.

ఇండస్ట్రీలో వరుస అవకాశాల కోసం ఇండస్ట్రీలో కంటిన్యూ కావడం కోసం చాలా మంది నా సమకాలీన నటీమణులు ఎంతో మంది తమ ముఖాలు బాడీలని మార్చుకోవడం కోసం అందంగా కనిపించడం కోసం సర్జరీలు చేయించుకున్నారు. కానీ తాను మాత్రం ఏనాడూ అందంగా కనిపించాలని సర్జీలని ఆశ్రయించలేదని స్పష్టం చేసింది. కంటెంట్ ప్రధానంగా సాగే సినిమాలకే తాను ప్రాధాన్యత ఇచ్చానని తెలిపింది. సర్జరీలు చేసుకుని అందంగా కనిపించడం కన్నా కథా బలమున్న కంటెంట్ ఓరియెంటెబ్ సినిమాల్లో నటించడానికే ప్రధాన్యత నిచ్చానని వెల్లడించింది.

గతంలో ఇదే తరహాలో రాధికా ఆప్టే స్పందించడంతో వివాదంగా మారిన విషయం తెలిసిందే. తాజాగా తను చేసిన వ్యాఖ్యలపై ఓలాంటి వివాదానికి తెరలేస్తుందో చూడాలని బాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. యంగ్ హీరోయిన్ ల కారణంగా తను అవకాశాల్ని కోల్పోయినట్టుగా తెలిసిందని ప్రశ్నిస్తే ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేసింది. అందం మాయలో తాను ఎప్పుడూ పడలేదని యవ్వనంగా కనిపించాలని తానెప్పుడూ సర్జరీలని ఆశ్రయించలేదని చెప్పుకొచ్చింది.

ఇక భారీ సినిమాల్లో యంగ్ హీరోలకు మాత్రమే అవకాశాలు లభిస్తున్నాయనే కామెంట్ లకు సమాధానం చెబుతూ మీకు ఎక్స్ వై జెడ్ లేదు.. మాకు ఎక్స్ వై జెడ్ అవసరం కొంత మంది ఫిల్మ్ మేకర్స్ ఓపెన్ గా అంటున్నారని వెల్లడించింది. భారత్ లోనే కాకుండా ప్రపంచ సినిమాలో దీనిపై చాలా మంది నటీమణులు పోరాడుతున్నారని తెలిపింది. అంతే కాకుండా అవకాశాల కోసం తాను ఏనాడూ అడ్డదారులు తొక్కలేదని సక్సెస్ కోసం అవకాశాల కోసం మాత్రం తాను స్ట్రగుల్ అయ్యానని తెలిపింది.


Recent Random Post: