
ఆలోచన లేకుండా మాట్లాడే సెలబ్రిటీల జాబితాలో కొందరు హీరోయిన్లు తరచూ కనిపిస్తుంటారు. తాజాగా ఆ జాబితాలో బాలీవుడ్ నటి రాధికా ఆప్టే పేరు కూడా వినిపిస్తోంది. బాలకృష్ణతో లెజెండ్, లయన్ వంటి చిత్రాల్లో నటించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రాధికా ఆప్టే, తన తాజా ఓటీటీ చిత్రం సాలీ మొహబ్బత్ ప్రమోషన్స్ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి.
ఇటీవల ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆమె హింసను వినోదం పేరుతో విక్రయిస్తున్న వాతావరణంలో తాను బిడ్డను పెంచలేనని పేర్కొంది. అలాగే ఈ విషయాన్ని బహిరంగంగా చెప్పడంలో తనకు ఎలాంటి భయం లేదని స్పష్టం చేసింది. ఆమె వ్యాఖ్యలు ప్రత్యక్షంగా పేరు చెప్పకపోయినా, అవి రణవీర్ సింగ్ నటించిన దురంధర్ సినిమాను ఉద్దేశించే చేసినవేనని అభిమానులు భావిస్తున్నారు.
అయితే నెటిజన్లు రాధికా ఆప్టే వ్యాఖ్యల్లో స్పష్టమైన లాజిక్ లోపం ఉందని విమర్శిస్తున్నారు. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో ఆమె ప్రధాన పాత్రలో నటించిన రక్త చరిత్ర చిత్రంలో తీవ్ర హింసా సన్నివేశాలు ఉన్న విషయం అందరికీ తెలిసిందే. అంతేకాదు, పలు బోల్డ్ వెబ్ సిరీస్‌లు, సినిమాల్లో కథ డిమాండ్ పేరుతో గ్లామర్, స్కిన్ షో చేసినప్పుడు ఇలాంటి నైతిక వ్యాఖ్యలు చేయకపోవడం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని అంటున్నారు.
అవకాశాలు ఉన్నప్పుడు ఒకలా, ఇప్పుడు అవకాశాలు తగ్గిన తర్వాత మరోలా మాట్లాడడంపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. లస్ట్ స్టోరీస్ వంటి చిత్రాల్లో నటించినప్పుడు లేని పెంపక బాధ్యత ఇప్పుడు అకస్మాత్తుగా గుర్తొచ్చిందా అంటూ సెటైర్లు కూడా పడుతున్నాయి.
మొత్తానికి, దురంధర్ బాక్సాఫీస్ విజయాన్ని కొంతమంది జీర్ణించుకోలేకపోతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గతంలో అమీర్ ఖాన్ చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా వివాదాస్పదమై డ్యామేజ్ కంట్రోల్ చేయాల్సి వచ్చిన విషయం గుర్తు చేస్తున్నారు. రాధికా ఆప్టే వ్యాఖ్యలు ఆ స్థాయికి వెళ్లకపోయినా, భారతీయ వినోద రంగం దిగజారిందన్నట్టుగా మాట్లాడటం అతిశయోక్తిగా ఉందని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అలాగే, హాలీవుడ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు అత్యున్నత మానవతా విలువలతోనే నిండిపోయాయా అనే కోణంలోనూ నెటిజన్లు వ్యంగ్యంగా ప్రశ్నలు సంధిస్తున్నారు. ఏది ఏమైనా, కొంతకాలంగా లైమ్‌లైట్‌కు దూరంగా ఉన్న రాధికా ఆప్టే ఈ వ్యాఖ్యలతో మళ్లీ వార్తల్లో నిలిచింది.
Recent Random Post:















