
లీడర్ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన దగ్గుబాటి రానా కెరీర్ ఆరంభంలోనే కొన్ని ఆటుపోట్లను ఎదుర్కొన్నాడు. సరైన హిట్లు లేకపోవడంతో పాటు, కొంతకాలం అనారోగ్య సమస్యలతో బ్రేక్ తీసుకున్న రానా, తన కెరీర్ మార్గాన్ని పూర్తిగా మార్చేసుకున్నాడు. నటన కంటే ఎక్కువగా ప్రొడక్షన్ వైపు మొగ్గు చూపుతూ, తండ్రి సురేష్ బాబు బాటలో నడుస్తున్నాడు.
నేనే రాజు నేనే మంత్రి వంటి హిట్ సినిమాలు వచ్చినా, సోలో హీరోగా చేసేందుకు వచ్చిన స్క్రిప్టులను రానా సులభంగా ఒప్పుకోలేదు. అయితే, అతను బాహుబలి, భీమ్లా నాయక్, వేట్టయాన్ వంటి చిత్రాల్లో నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలతో మెప్పించాడు. అయితే, తాజా సమాచారం ప్రకారం రానా త్వరలోనే సోలో హీరోగా కంబ్యాక్ ఇవ్వనున్నాడని టాలీవుడ్ వర్గాల్లో చర్చ నడుస్తోంది.
సీనియర్ రచయిత చిన్నికృష్ణ ప్రస్తుతం రానా కోసం ఓ పవర్‌ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. ఈ ప్రాజెక్ట్‌కు దర్శకుడు ఎవరో ఇంకా ఫిక్స్ కాలేదు. అయితే, కొత్త టాలెంటెడ్ డైరెక్టర్లలో ఒకరికి అవకాశం ఇవ్వాలని రానా ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ సినిమా రెగ్యులర్ కమర్షియల్ ఫార్ములా సినిమాగా కాకుండా, సోషల్ మెసేజ్ మరియు మాస్ ఎలిమెంట్స్ మిళితమైన కథగా ఉంటుందని చెబుతున్నారు. ఇంద్ర, నరసింహనాయుడు, నరసింహ, గంగోత్రి వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలకు కథ అందించిన చిన్నికృష్ణ ఈ సినిమాకు కూడా భిన్నమైన టచ్ ఇవ్వబోతున్నారట.
ఇప్పటికే రానా ప్రధాన పాత్రలో తేజ తెరకెక్కించాల్సిన రాక్షస రాజు సినిమాను ఏడాది క్రితమే అనౌన్స్ చేశారు. కానీ అనేక కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ వాయిదా పడుతూ చివరికి క్యాన్సిల్ అయ్యింది. దీంతో రానా తన మూడ్ మార్చుకుని కొత్త కథ కోసం వెతుకుతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటివరకు రానా ఎక్కువగా క్యారెక్టర్ ఓరియెంటెడ్ రోల్స్ మాత్రమే చేశాడు. కానీ, ఇకపై తన సోలో హీరో ఇమేజ్ ను మరింత బలపరిచేందుకు ఈ కొత్త ప్రాజెక్ట్‌తో గ్రాండ్ రీ-ఎంట్రీ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్టు టాక్. సంక్రాంతి కానుకగా బాబాయ్ వెంకటేష్ మళ్లీ సక్సెస్ ట్రాక్‌లోకి వచ్చినట్లే, రానా కూడా తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
Recent Random Post:















