రామ్ చరణ్-ఉపాసనకు ట్విన్ బేబీస్!

Share


మెగా హీరో రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల మరోసారి తల్లి కావబోతున్న విషయం తెలిసిందే. ఈ సంతోషకరమైన వార్తను తానే షేర్ చేస్తూ, తన సీమంతం వేడుక వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీపావళి సమయానికి కుటుంబానికి “డబుల్ ధమాకా” సంతోషం అందిందని పేర్కొన్నారు.

అయితే, ఉపాసన తన పోస్ట్‌లో “డబుల్” అని స్పెసిఫిక్‌గా మెన్షన్ చేయడం వల్ల, ఆమెకు జంట కవలలు జన్మనివ్వబోతున్నారని అభిమానులు ఊహించారు. అదే సమయంలో, ఆమె తల్లి శోభన కామినేని క్లారిటీ ఇచ్చారు. వచ్చే ఏడాది రామ్ చరణ్-ఉపాసన జంటకు ట్విన్ బేబీస్‌కు గ్రాండ్ వెల్‌కమ్ ఇవ్వబోతున్నారని వెల్లడించారు.

దీంతో క్లీంకారకు ఇద్దరు సిబ్లింగ్స్ రాబోతున్నట్లు ఖరారు. ఉపాసన సీమంతం వేడుకలో మెగా ఫ్యామిలీ మెంబర్స్ మాత్రమే కాక, సినీ ప్రముఖులు కూడా హాజరయ్యారు. సీనియర్ హీరోలు వెంకటేష్, నాగార్జునలు తమ ఫ్యామిలీస్‌తో వచ్చారు. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ నయనతార కూడా భర్త, ఇద్దరు పిల్లలతో ఈ వేడుకలో పాల్గొన్నారు. నయన్ ఫ్యామిలీ సభ్యులు అందరూ ట్రెడిషనల్ వేర్‌లో అద్భుతంగా కనిపించారని అందరూ సోషల్ మీడియాలో చెబుతున్నారు. ముఖ్యంగా నయన్ ట్విన్స్ కవలలు స్పెషల్ ఆకర్షణగా నిలిచారు.

వేడుకలో ఉపాసన సంతోషంగా ఉండటమే కాక, ట్విన్స్‌కు తల్లి కానుంది అనే స్పెషల్ మోమెంట్‌గా గుర్తింపు పొందింది. సౌత్ ఇండస్ట్రీలో కవలలు ఉన్న సెలబ్రిటీ జంటల్లో నయనతార-విఘ్నేష్ శివన్ ఒకరు. ఇప్పుడు రామ్ చరణ్-ఉపాసన జంట కూడా ఈ లిస్ట్‌లో చేరనున్నారు. నయన్ ఫ్యామిలీ అటెండ్ కావడానికి ముఖ్య కారణం, రామ్ చరణ్‌తో ఆమె చేస్తున్న కొత్త సినిమా—మన శంకర వరప్రసాద్ గారు—షూట్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. చిరు ఆహ్వానంతో ఈ సతీసమేత వేడుకలో నయన్ కుటుంబంతో హాజరైన విషయం అభిమానులకు స్పెషల్ మోమెంట్‌గా అనిపించింది.


Recent Random Post: