
అతిలోక సుందరి దివంగత శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ బిజీగా మారింది. బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చి ఎన్నో సంవత్సరాలు అయినప్పటికీ ఇంకా ఒక సూపర్ హిట్ కమర్షియల్ మూవీ అందుకోలేకపోయినా, జాన్వీకి డిమాండ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. స్టార్ కిడ్‌గా ఉండటం, ఇండస్ట్రీలో బలమైన పరిచయాలు కలగడం వలన ఆమెకు వరుసగా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి.
జాన్వీ ఎప్పుడూ అందరితో సన్నిహితంగా, గౌరవంగా మెలగడం వల్ల టాప్ ఫిల్మ్మేకర్లు కూడా ఆమెను ప్రోత్సహిస్తూ ఉంటారు. ముఖ్యంగా ఆమెను ఇండస్ట్రీకి పరిచయం చేసిన కరణ్ జోహార్, ఇప్పటికీ జాన్వీ కెరీర్‌కు బలమైన సపోర్ట్‌గా నిలుస్తున్నాడు. కరణ్ జోహార్ నిర్మాణ సంస్థ ధర్మ ప్రొడక్షన్స్ తనకు హోమ్ బ్యానర్ లాంటిదని జాన్వీ అనేకసార్లు పేర్కొంది. ధర్మ ప్రొడక్షన్స్‌లో సినిమా చేసే అవకాశం వచ్చినప్పుడు జాన్వీ ఎప్పుడూ “అవును” అనడంలో వెనుకాడదట.
ఇటీవల ధర్మ ప్రొడక్షన్స్‌లో తెరకెక్కిన ‘హోమ్ బౌండ్’ సినిమాలో జాన్వీ ప్రధాన పాత్రలో నటించింది. ఈ చిత్రం భారతదేశం తరపున ఆస్కార్ ఎంట్రీగా ఎంపిక కావడం విశేషం. ఇషాన్ ఖట్టర్, విశాల్ జైత్వాల్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు జాన్వీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఈ ప్రాజెక్ట్ కోసం జాన్వీ సహా మొత్తం టీం పారితోషికం విషయంలో రాజీ పడిందని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
అయితే ప్రస్తుతం జాన్వీ కపూర్ రామ్ చరణ్ సరసన నటిస్తున్న ‘పెద్ది’ చిత్రానికి మాత్రం భారీగా సుమారు ₹4 కోట్లు పారితోషికం అందుకుంటోందని సమాచారం. అంతేకాకుండా ‘దేవర’ సినిమాలో కూడా ఆమె భారీ రెమ్యూనరేషన్ అందుకుందని తెలుస్తోంది. సౌత్ ఇండియాలో జాన్వీకి ఉన్న క్రేజ్ కారణంగా నిర్మాతలు ఆమెకు పెద్ద మొత్తాలను ఆఫర్ చేస్తున్నారు.
అయితే బాలీవుడ్లో మాత్రం జాన్వీ ఇప్పటికీ ఆఫర్ల కోసం కాస్త కష్టపడాల్సి వస్తోంది. సినీ విశ్లేషకుల మాట ప్రకారం, ‘పెద్ది’
సినిమా హిట్ అయితే, టాలీవుడ్లోనే కాదు కోలీవుడ్‌లో కూడా జాన్వీ మరింత బిజీగా మారే అవకాశాలు ఉన్నాయి. ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న ఈ భారీ బడ్జెట్ మూవీని 2026 సమ్మర్లో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి.
Recent Random Post:















