రాహుల్ సిప్లిగంజ్ సర్‌ప్రైజ్‌తో హరిణ్య ఆనందం ఓవర్‌ఫ్లో

Share


టాలీవుడ్ స్టార్ సింగర్ రాహుల్ సిప్లిగంజ్ తన కాబోయే భార్య హరిణ్యా రెడ్డికి ఇచ్చిన సర్‌ప్రైజ్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద సెన్సేషన్‌గా మారింది. రాహుల్–హరిణ్యా పెళ్లి ఈ నెల 27న జరగనుంది. పెళ్లి ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్న వేళ, తాజాగా జరిగిన సంగీత్ వేడుకలో రాహుల్ చేసిన సర్‌ప్రైజ్ హరిణ్యను షాక్‌లోకి నెట్టింది.

సంగీత్ కార్యక్రమానికి టీమ్ ఇండియా స్టార్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్‌ను రాహుల్ ప్రత్యేకంగా ఆహ్వానించాడు. చాహల్ అక్కడ ప్రత్యక్షంగా కనిపించగానే హరిణ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ ప్రత్యేక క్షణాన్ని, సంగీత్ ఫోటోలతో కలిసి షేర్ చేసిన హరిణ్య, “నా లైఫ్‌లో మర్చిపోలేని గిఫ్ట్! థ్యాంక్యూ రాహుల్” అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. ఆ ఫోటోలు, వీడియోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

హరిణ్యకు చాహల్ మీద చిన్ననాటి నుంచే పిచ్చి అభిమానం. తాను ఎంతో ఇష్టపడే ప్లేయర్ స్వయంగా తన ప్రీ–వెడ్డింగ్ ఈవెంట్‌కి రావడంతో ఆమె ఉత్సాహం మరింత రెట్టింపైంది. ప్రస్తుతం రాహుల్–హరిణ్య–చాహల్ కలిసి దిగిన ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. వారిని చూసి ఫ్యాన్స్, నెటిజన్లు జంటకు శుభాకాంక్షలు చెబుతూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక రాహుల్–హరిణ్య పెళ్లి విషయంలో, ఈ వేడుకకు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. రాహుల్ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రత్యేకంగా ఆహ్వానించగా, ఆయన కూడా హాజరయ్యే అవకాశం ఉందని సమాచారం. నుడా చైర్మన్ కోట్లం రెడ్డి శ్రీనివాసులు రెడ్డి సోదరుడి కూతురే హరిణ్య రెడ్డి.

నవంబర్ 27న ఉదయం 5 గంటలకు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని ఒక లగ్జరీ ప్యాలెస్‌లో రాహుల్–హరిణ్యల పెళ్లి ఘనంగా జరగనుంది.


Recent Random Post: