
కక్కొచ్చినా, కల్యాణమొచ్చినా ఆపలేం అంటారు. కానీ వర్మ విషయంలో మాత్రం ఏదైనా చర్చ వస్తే, అతను తన రియాక్షన్‌తో అందరిని ఆకర్షిస్తున్నాడు. తాజాగా శివాజీ వివాదాల తర్వాత, వర్మ ఇప్పుడు బాలీవుడ్ మూవీ ధురంధర్ పై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
బాలీవుడ్లో ధురంధర్ ఒక లేటెస్ట్ సెన్సేషన్‌గా మారి, ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా నిలిచింది. రణ్వీర్ సింగ్ ప్రధాన పాత్రలో ఆదిత్యధర్ రూపొందించిన ఈ మూవీ, రూ.1100 కోట్లకు పైగా వసూళ్లను సాధించి, ఈ ఏడాది అత్యధిక వసూళ్ల సాధించిన సినిమాగా నిలిచింది.
సినిమా రిలీజ్ తరువాత మొదటి వారం విమర్శలు వినిపించాయి. సెక్యులర్ వాదులు, యూట్యూబర్స్ ఈ మూవీపై విమర్శలు గుప్పించారు. పాకిస్థాన్, అరబ్ దేశాల్లో బ్యాన్ కావడం వలన, సినిమాపై అంతర్జాతీయంగా ఆసక్తి పెరిగింది. మేకింగ్, టేకింగ్ పరంగా సరికొత్త ఒరవడికి శ్రీకారం చుట్టిన ధురంధర్‌పై ప్రముఖులు, సినీ లవర్స్ ప్రశంసలు కురిపిస్తున్నారు.
వర్మ కూడా ఈ సినిమాకు ప్రశంసల వర్షం కురిపించారు. దర్శకుడు సినిమాను తీర్చిదిద్దిన విధానం, ధురంధర్‌ను తెరపై ఆవిష్కరించిన పద్ధతి ఇండియన్ సినిమాకు గేమ్-చేంజర్ అని పేర్కొన్నారు. మేకర్స్ నుండి, హీరో వర్షన్ వరకు టాలీవుడ్ కూడా ధురంధర్ నుంచి పాఠాలు నేర్చుకోవాలంటూ సెటైర్లు వేశారు.
అయితే వర్మ చేసిన వ్యాఖ్యలు సౌత్ ఇండస్ట్రీని కొంచెం కించపరచడంగా కూడా చూస్తున్నారు. ఆయన ధురంధర్ ని పొగిడుతూ “బాలీవుడ్‌పై సౌత్ వాళ్ల దండయాత్ర ఆగిపోయింది. ధురంధర్ 2 మరింత హడలెత్తిస్తుంది” అని ట్వీట్ చేశారు.
నెటిజన్లు దీనిపై భిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు వర్మ హ్యాంగోవర్లో చెప్పారని అంటుంటే, మరికొందరు ఆయన మాట సరిగా ఉందని సమర్థిస్తున్నారు. ధురంధర్ 2 మార్చి 19న రిలీజ్ కానుంది. వర్మ ఇప్పటికే దీన్ని చూసినట్లు తెలుస్తోంది. రెండవ భాగం మొదటి భాగానికి మించి హై-వోల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు, కొత్త సీక్వెన్స్‌లతో ప్రేక్షకులను ఆకట్టేలా ఉంటుంది అని ఆయన చెప్పారు.
Recent Random Post:















