
టాలీవుడ్లో యంగ్ డైరెక్టర్ చందూ మొండేటి క్రేజ్ అందరికీ తెలిసిందే. రీసెంట్గా ఆయన “తండేల్” మూవీతో మంచి హిట్
సాధించిన తర్వాత, ఇప్పుడు సోషల్ ఫాంటసీ జోనర్లో యానిమేషన్ మూవీ వాయుపుత్రను తెరకెక్కిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్ ప్రముఖ నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో రూపొందనుంది.
సినిమా అనౌన్స్మెంట్ పోస్టర్ రిలీజ్‌తోనే ఫ్యాన్స్ నుండి సూపర్ రెస్పాన్స్ అందింది. సినిమా వచ్చే ఏడాది దసరా రిలీజ్ కానుందట. సోషియో ఫాంటసీ జోనర్లో కార్తికేయ 2 తర్వాత మళ్లీ అదే జోనర్లో వర్క్ చేయనున్న చందూ, ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
చందూ మాట్లాడుతూ, హనుమంతుడు తన నిజమైన శక్తిని గ్రహించి, సీతాదేవిని వెతుకుతూ సముద్రం మీద దూకి అసాధారణ విన్యాసాలు చేయడం వంటివి వాయుపుత్ర కథలో ప్రధానంగా చూపబడతాయని చెప్పారు. ఆయన మహాభారతం, రామాయణం వంటి భారతీయ ఇతిహాసాల నుంచి ఎప్పుడూ ప్రేరణ పొందతానని, యానిమేషన్ ప్రపంచాన్ని ఆస్వాదిస్తారని చెప్పారు. Marvel సినిమాలు, Demon Slayer వంటి ప్రాజెక్టులను పిల్లలతో కలిసి ఆస్వాదిస్తానని, ఇప్పుడు మన పౌరాణిక కథలను సజీవంగా తీసుకురావాలనుకుంటున్నట్లు తెలిపారు.
కార్తికేయ 2లో శ్రీకృష్ణుని శక్తిని చూపించాక, ఇప్పుడు హనుమంతుడి మహిమను ప్రదర్శించాల్సిన సమయం వచ్చినట్లు చందూ పేర్కొన్నారు. వాయుపుత్ర ద్వారా హిందూ దేవుళ్ల గొప్పతనం, ముఖ్యంగా హనుమంతుడి విశేషాలు ప్రేక్షకులకు అర్థమయ్యేలా చేయాలని ఆయన ఆశించారు.
సినిమా యానిమేషన్ కావడంతో, ఎలాంటి పరిమితులు లేకుండా కథను ఊహించినట్లుగానే చెప్పగలమని తెలిపారు. ఐదుగురు సాంకేతిక నిపుణులతో కూడిన ప్రధాన బృందం స్టోరీబోర్డ్ సృష్టిస్తుందని, ఆ తర్వాత 50–100 మంది సభ్యులతో కూడిన VFX టీమ్ కథకు రూపం ఇస్తుందని చెప్పారు. బాలీవుడ్లో అరంగేట్రం చేయడం ఎప్పుడూ ఒక కల అని, కానీ ఇప్పుడు పూర్తి దృష్టి వాయుపుత్రపైనే ఉందని వెల్లడించారు. సినిమా కొత్త బెంచ్‌మార్క్‌లను సృష్టిస్తుందన్న ఉద్దేశంతో పనిచేస్తున్నారని చందూ చెప్పారు.
Recent Random Post:















