వార్ 2 కోసం నాటు నాటు మళ్లీ హైలైట్!

Share


నాటు నాటు – ఈ పాట ఎంత పెద్ద సంచలనం సృష్టించిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆస్కార్ అవార్డు గెలుచుకున్న ఈ మ్యూజికల్ మ్యాజిక్ ఇప్పటికీ ప్రతి సంగీత ప్రేమికుడి ప్లే లిస్ట్‌లో ఉంటుంది. విన్న ప్రతి సారి ఉర్రూతలూగించే ఈ సాంగ్, ఇప్పుడు మరోసారి హైలైట్ అవుతోంది. కారణం – వార్ 2 ప్రమోషన్లు!

రాజమౌళి తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ RRR లో ఎన్టీఆర్, రామ్ చరణ్ లు కలసి చేసిన ఈ ఎనర్జిటిక్ డ్యాన్స్ నంబర్ ఇప్పుడు వార్ 2 మూవీ మేకర్స్ చేతిలో ఓ ప్రమోషనల్ వెపన్‌గా మారింది. ఇందులో ఒక కీలక విషయం ఏమిటంటే – ఎన్టీఆర్‌ వార్ 2 ద్వారా బాలీవుడ్‌కు సోలోగా గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఆయన సరసన హృతిక్ రోషన్ కీలక పాత్రలో నటిస్తుండగా, కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తున్నారు. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ ఈ ఆగస్టు 14న విడుదల కాబోతుంది.

ఇప్పటికే చిత్ర బృందం భారీ ప్రమోషన్లు ప్రారంభించింది. తాజాగా ఎన్టీఆర్, హృతిక్ మధ్య ట్వీట్స్, ఫన్నీ ఛాలెంజ్‌లు, రిటర్న్ గిఫ్ట్‌ల హడావుడి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మొదటగా తారక్, హృతిక్ ఇంటికి ఒక స్పెషల్ వాహనం పంపారు – అందులో “ఘుంగ్‌రు టూట్ జాయేంగే, పర్ హమ్‌సే యే వార్ జీత్ నహీ పాయోగే” అనే క్యాప్షన్ చర్చనీయాంశమైంది. దీనికి రిప్లైగా హృతిక్ కూడా తారక్‌కి ఓ పోస్టర్‌తో కూడిన వాహనం పంపించారు.

తాజాగా ఎన్టీఆర్ తన బాల్కనీలో ఆ వాహనాన్ని చూస్తున్న ఫొటోను షేర్ చేస్తూ, “హృతిక్ సార్ నుంచి వచ్చిన మంచి రిటర్న్ గిఫ్ట్ ఇది… కానీ ఇది ముగింపు కాదు. ఆగస్టు 14న అసలైన యుద్ధం మొదలవుతుంది” అంటూ పంచుకున్నారు. హృతిక్ పంపిన వాహనంపై “నాటు నాటు లాగా ఎంతైనా ఎగురవచ్చు… కానీ వార్ లో గెలిచేది మాత్రం నేనే” అనే డైలాగ్ ఉండటంతో ఇది మరింత వైరల్ అయింది.

ఇదంతా చూస్తుంటే వార్ 2 ప్రమోషన్లలో నాటు నాటు పాటను భారీగా వాడుతున్నారు అన్నమాట. ఇకపోతే ఈ సినిమా కోసం హృతిక్ – తారక్ కలిసి చేసిన ఓ సాంగ్, నాటు నాటును మించి ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఎంతైనా, గత సినిమాల పాపులారిటీని నూతన చిత్ర ప్రమోషన్లలో వాడుకోవడం ఇండస్ట్రీలో కామనే. కానీ, వార్ 2 లెక్క మాత్రం మరో స్థాయిలో ఉంది!


Recent Random Post: