ఫిదా సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ సాయి పల్లవి. హీరోయిన్ గా తెలుగు లో చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు దక్కించుకున్న సాయి పల్లవి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకుంది. లేడీ పవర్ స్టార్ అంటూ సాయి పల్లవికి అభిమానులు బిరుదు కూడా ఇచ్చారు.
ఆమె ఏదైనా కార్యక్రమానికి హాజరు అవుతుంది అంటే జనాలు భారీ ఎత్తున తరలి వచ్చేంతగా అభిమానులు ఆమెకు అయ్యారు. అలాంటి అభిమానులు ఇప్పుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాయి పల్లవి సినిమాలు చేయకపోవడంతో పాటు.. ఈమధ్య కాలంలో పూర్తిగా ఆధ్యాత్మికం వైపుకు అడుగులు వేస్తుండటంతో సాయి పల్లవి సినిమాలు చేయదా అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
సాయి పల్లవి సినిమాలు చేయకూడదు అని ఏమీ కండీషన్ పెట్టుకోలేదట.. కానీ ప్రస్తుతానికి సినిమాలు చేయడం లేదు. ఇటీవల సాయి పల్లవి ఆధ్యాత్మికంగా విభిన్నమైన సాంప్రదాయ దుస్తుల్లో కనిపించి ఫ్యాన్స్ కు షాక్ ఇచ్చింది. ఇంతలోనే సాయి పల్లవి చీర కట్టులో ఈ ఫొటోలు సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాయి.
సాదారణంగా హీరోయిన్స్ అంటే చీర కట్టులో నడుము నాభి అందాలను చూపిస్తూ క్లీ వేజ్ షో తో అదరగొడుతూ ఉంటారు. కానీ సాయి పల్లవి అవేం చూపించకుండా చాలా క్యూట్ గా చీర కట్టులో కొంత కూడా స్కిన్ షో చేయకుండా ఇంత అందం ఈమెకే సొంతం అన్నట్లుగా ఫొటోలను షేర్ చేసి అందరిని ఆశ్చర్యపర్చింది.
ఈ ఫొటోలు చూస్తు ఉంటే మళ్లీ సాయి పల్లవిని వెండి తెరపై ఎప్పుడు చూస్తామా అనిపిస్తుంది అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. పెద్ద హీరోల సినిమాల్లో నటించే ఛాన్స్ వచ్చినా కూడా కాదని ఈ అమ్మడు ప్రస్తుతానికి సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. ఈ ఏడాదిలో అయినా సాయి పల్లవి కొత్త సినిమాలు చేస్తుందేమో చూడాలి.
Recent Random Post: