విజయ్ ఆంటోనీ ట్వీట్ వివాదం: నెటిజన్ల ఫైర్, వెంటనే సవరణ

Share


తన కెరీర్ మొత్తాన్ని చూసుకుంటే విజయ్ ఆంటోనీకి గుర్తింపు తెచ్చినవి కేవలం రెండు సినిమాలు — బిచ్చగాడు మరియు బిచ్చగాడు 2. ఇతర సినిమాలు పెద్దగా ఆకట్టుకోకపోయినా, దశాబ్దం దాటిన కెరీర్‌లో ఆయన బిజీగా ఉండటం ఆశ్చర్యమే. తాజాగా, పెహల్గాం దుర్ఘటన నేపథ్యంలో ఆయన చేసిన ఓ ట్వీట్ వల్ల విజయ్ ఆంటోనీ అనవసరంగా వివాదంలో చిక్కుకున్నారు.

ఆ ట్వీట్‌లో ఆయన పాకిస్థాన్‌లో 50 లక్షల భారతీయులు ఉన్నారని, వారు శాంతి మరియు సంతోషం కోరుకుంటున్నారని పేర్కొన్నారు. దీని ద్వారా ప్రభుత్వ తీవ్ర చర్యలను నెమ్మదించాలనే సంకేతం ఇచ్చారనే అభిప్రాయం నెటిజన్లలో పెరిగింది. వెంటనే స్పందించిన నెటిజన్లు, “పాకిస్థాన్ ఎంత అమాయకులను చంపినా చూడకూడదా?” అంటూ ఆయనను ప్రశ్నించారు. ఇంకా, “ఆ 50 లక్షల డేటా ఏంటి? ఎక్కడి ఆధారం?” అంటూ బలమైన రివర్స్ ఎటాక్ చేశారు.

దీంతో తన తప్పును గ్రహించిన విజయ్ ఆంటోనీ వెంటనే మరో ట్వీట్ చేశారు. ఈసారి మాత్రం భారత ప్రభుత్వం చర్యలకు మద్దతు ఇస్తూ, టెర్రరిస్టులను అంతమొందించాలన్న సందేశం ఇచ్చారు. భారతదేశ ఐక్యతను దెబ్బతీసే ప్రతి ప్రయత్నాన్ని భగ్నం చేయాలన్నారు.

ప్రథమ ట్వీట్‌లో విజయ్ ఉద్దేశం ఏమిటి అన్నది పక్కనపెడితే, అది ప్రజల మనోభావాలను గాయపరిచినదే. మన దేశంపై దాడులు జరిగితే, కేవలం అక్కడ మనవాళ్లు ఉన్నారనే కారణంతో చర్యలు తీసుకోకపోవడం సరికాదని నెటిజన్లు స్పష్టం చేశారు. విజయ్ తన వ్యాఖ్యలు అపార్థం అయ్యాయంటూ వివరణ ఇచ్చుకున్నా, ప్రజలు మాత్రం క్లియర్‌గా తన మాటల అర్థం తెలుసుకున్నట్టున్నారు.


Recent Random Post: