విజయ్ దేవరకొండ కొత్త సినిమా ‘రౌడీ జనార్ధన్’ అధికారికంగా ప్రకటించబడ్డది

Share


విజయ్ దేవరకొండ, దిల్ రాజు కాంబో “ది ఫ్యామిలీ స్టార్” బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ఈ సినిమా మొదట్లో ఉన్న అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది. కానీ, దిల్ రాజు గత ఏడాది మరో ప్రాజెక్ట్‌ను ప్రకటించి అభిమానుల్లో ఆసక్తి క్రియేట్ చేశారు. “రౌడీ జనార్ధన” అనే టైటిల్‌తో కొత్త సినిమా రూపొందించనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమాను “రాజావారు రాణిగారు” ఫేమ్ రవికిరణ్ కోలా దర్శకత్వంలో రూపొందించబోతున్నారు.

గత ఏడాది రిలీజ్ అయిన ప్రీ లుక్ పోస్టర్ ప్రేక్షకుల మన్ననలను పొందినప్పటికీ, ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు బయటికి రాలేదు. రాయలసీమ నేపథ్యంలో యాక్షన్ తో కూడిన సినిమా అని లీకుల ప్రకారం తెలుస్తుంది. ఇక విజయ్ దేవరకొండ ప్రస్తుతం “కింగ్ డమ్” షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా పూర్తయిన తరువాత “రౌడీ జనార్ధన” సెట్స్ పైకి వెళ్లే అవకాశం ఉంది.

అలాగే, విజయ్ దేవరకొండ ఇతర ప్రాజెక్టులలో కూడా ప్యాన్ ఇండియా సినిమాలు ప్లాన్ చేస్తున్నాడు. “శ్యామ్ సింగరాయ్” ఫేమ్ రాహుల్ సంక్రుత్యాన్ దర్శకత్వంలో మరో ప్యాన్ ఇండియా మూవీ కూడా పీప్రొడక్షన్ దశలో ఉంది. వీటి సెట్స్ పైకి త్వరలో వెళ్లే అవకాశం ఉంది.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పాత్ర పేరు “జనార్ధన”గా ఉంది, ఇది “ఫ్యామిలీ స్టార్”లో కూడా అలాగే ఉండడంతో, ఈ సెంటిమెంట్ ప్రేక్షకులను ఆకట్టుకోవచ్చు. వరస ఫ్లాపుల తరువాత, విజయ్ దేవరకొండకు ఒక పెద్ద హిట్ అవసరం. ఈ సినిమా ప్యాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్‌తో రూపొందే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.


Recent Random Post: