
టాలీవుడ్లో టైర్-2 హీరోలు వరుస ప్రాజెక్టులతో ఫుల్ స్పీడ్‌లో దూసుకుపోతున్నారు. స్టార్ హీరోలు ఒక్కో పాన్ ఇండియా సినిమాతో బిజీగా ఉంటే, వీరు మాత్రం బ్యాక్ టు బ్యాక్ సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ భారీ లైనప్‌ను సిద్ధం చేసుకుంటున్నారు. ఈ జాబితాలో ముందుంటున్న హీరోల్లో స్టార్ రౌడీ విజయ్ దేవరకొండ ఒకరు. గతంలో కంటే ఇప్పుడు ఆయన ప్రాజెక్ట్‌ల ఎంపికలో మరింత వేగం పెంచి వరుసగా క్రేజీ సినిమాలను ఓకే చేస్తున్నారు.
ప్రస్తుతం విజయ్ దేవరకొండ రెండు భారీ సినిమాల్లో నటిస్తున్నాడు. దిల్ రాజు, శిరీష్ నిర్మాణంలో రూపొందుతున్న రౌడీ జనార్థన్ ఒకటి కాగా, రాహుల్ సంకృత్యన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా రణబలి మరోటి. 90వ దశకం నేపథ్యంలో సాగనున్న పొలిటికల్ యాక్షన్ డ్రామాగా దర్శకుడు రవికిరణ్ కోలా రౌడీ జనార్థన్ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఇందులో విజయ్ దేవరకొండ పక్కా రౌడీ పాత్రలో పవర్‌ఫుల్‌గా కనిపించనున్నాడు. కొత్త మేకోవర్, ప్రత్యేకమైన క్యారెక్టర్ డిజైన్‌తో ఈ సినిమా రూపొందుతోంది. ఇందులో కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం షూటింగ్ జరుగుతున్న ఈ చిత్రం ఈ ఏడాదిలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఇక మరోవైపు రణబలి అనే పాన్ ఇండియా మూవీ కూడా భారీ స్థాయిలో రూపొందుతోంది. ప్రీ-ఇండిపెండెన్స్ కాలం నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో స్వాతంత్ర్యానికి ముందు ఒక యువకుడు చేసిన పోరాటం ప్రధానంగా ఉంటుంది. ఈ చిత్రాన్ని ఐదు భాషల్లో పాన్ ఇండియా స్థాయిలో సెప్టెంబర్ 11న విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.
ఈ రెండు సినిమాలు చివరి దశకు చేరుకుంటుండటంతో విజయ్ దేవరకొండ ఇప్పటికే తదుపరి ప్రాజెక్ట్‌లపై దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. వీటి తర్వాత మరో రెండు భారీ ప్రాజెక్ట్‌లకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇవ్వబోతున్నారని సమాచారం. అందులో ఒకటి దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఈ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ భారీ స్థాయిలో నిర్మించనుంది. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వచ్చే అవకాశముంది.
ఇదిలా ఉంటే, నేచురల్ స్టార్ నానితో హాయ్ నాన్న చిత్రాన్ని తెరకెక్కించి మంచి పేరు తెచ్చుకున్న దర్శకుడు శౌర్యవ్ కూడా విజయ్ దేవరకొండకు ఒక కథ వినిపించాడని తెలుస్తోంది. కథ నచ్చడంతో ఈ ప్రాజెక్ట్‌పై చర్చలు జరుగుతున్నాయని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. అన్నీ సెట్ అయితే ఈ సినిమాను వైరా ఎంటర్టైన్మెంట్స్తో కలిసి కెవిఎన్ ప్రొడక్షన్స్ నిర్మించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.
మొత్తానికి, ప్రస్తుతం చేస్తున్న రెండు సినిమాల తర్వాత కూడా వరుస ప్రాజెక్ట్‌లతో విజయ్ దేవరకొండ భారీ లైనప్‌ను రెడీ చేస్తున్నాడు. దీంతో రాబోయే రోజుల్లో ఆయన నుంచి వరుసగా సినిమాలు వచ్చే అవకాశముందని టాలీవుడ్లో చర్చ జరుగుతోంది.
Recent Random Post:















