
టాలీవుడ్లో పూరీ జగన్నాథ్ సినిమాలకు ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ఉంది. ఒకప్పుడు ఇండస్ట్రీ రికార్డులను తిరగరాసిన దర్శకుల్లో పూరీ ఒకరు. పూరీ సినిమా అంటే హీరోకు మాస్ కిక్, ఫ్యాన్స్‌కు ఫుల్ హైప్. అయితే గత కొన్నేళ్లుగా తన మార్క్ సినిమాలు చేయలేక కెరీర్లో వెనుకబడ్డాడు. ఇస్మార్ట్ శంకర్‌తో హిట్ అందుకున్నప్పటికీ, ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ఇప్పుడిప్పుడు పూరీ జగన్నాథ్ డైరెక్షన్లో విజయ్ సేతుపతి హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. స్లమ్ డాగ్ అనే టైటిల్ పరిశీలనలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే మంచి బజ్ ఉంది. సాధారణంగా పూరీ సినిమా అంటే వేగంగా మొదలై త్వరగా పూర్తవుతుంది. కానీ ఈసారి మాత్రం విజయ్ సేతుపతి సినిమా చాలా సమయం తీసుకుంటుండటం గమనార్హం.
లైగర్, డబుల్ ఇస్మార్ట్ ఫ్లాప్‌ల తర్వాత పూరీతో సినిమా చేయడానికి చాలా మంది హీరోలు ముందుకు రాలేదు. కానీ విజయ్ సేతుపతి మాత్రం పూరీ టాలెంట్‌పై నమ్మకం పెట్టుకున్నాడు. పూరీ–విజయ్ సేతుపతి కాంబినేషన్‌ను ఆడియన్స్ అసలు ఊహించలేదు. పూరీ ఎలాంటి కథ చెప్పి విజయ్ సేతుపతిని ఒప్పించాడన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
విజయ్ సేతుపతి ఒక సినిమా ఓకే చేశాడంటే అందులో ఖచ్చితంగా విషయం ఉంటుందనే నమ్మకం ఇండస్ట్రీలో ఉంది. మరోవైపు పూరీ సినిమాలకు ఇప్పటికీ హార్డ్‌కోర్ ఫ్యాన్స్ ఉన్నారు. ఈసారి పూరీ తన పాత రోజుల్ని గుర్తు చేసేలా వర్కింగ్ స్టైల్ చూపిస్తున్నాడట. విజయ్ సేతుపతి సరసన సంయుక్త మీనన్ హీరోయిన్గా నటిస్తోంది.
ఈ సినిమాతో విజయ్ సేతుపతి మరోసారి తన నటన శక్తిని చూపించాలని చూస్తున్నాడు. నిజానికి ఈ సినిమా గత ఏడాదే విడుదల కావాల్సి ఉంది. కానీ ఇప్పటివరకు ఫస్ట్ లుక్ లేదా టీజర్ కూడా రిలీజ్ కాలేదు. ఆడియన్స్ అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా సినిమా ఉండాలనే ఆలోచనతోనే పూరీ ఈసారి చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నాడని టాక్.
విజయ్ సేతుపతి ఇప్పటికే తమిళ్‌తో పాటు తెలుగులోనూ వరుస ప్రాజెక్ట్‌లు చేస్తున్నాడు. సైరా నరసింహారెడ్డిలో కీలక పాత్ర పోషించిన ఆయన, ఉప్పెనలో విలన్‌గా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇప్పుడు పూరీ సినిమాతో తెలుగు–తమిళ భాషల్లో మరోసారి తన సత్తా చాటాలని చూస్తున్నాడు.
మరోవైపు ఈ సినిమాతో పూరీ జగన్నాథ్ కూడా గట్టిగా కమ్‌బ్యాక్ ఇవ్వాలని భావిస్తున్నాడు. అదే జరిగితే, ఇది పూరీ కెరీర్లో ఒక కీలకమైన సెకండ్ ఇన్నింగ్స్‌కు నాంది అవుతుందని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి.
Recent Random Post:















