విజయ్ సేతుపతితో పూరీ జగన్నాథ్ బౌన్స్ బ్యాక్

Share


డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన ఫామ్‌ లోకి రావాలని తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇటీవల చేసిన డబుల్ ఇస్మార్ట్ తో సక్సెస్ ట్రాక్ ఎక్కుతారని అందరూ భావించినా, ఆ సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయింది. దీంతో పూరీకి మళ్లీ ఎవరైనా హీరోలు ఛాన్స్ ఇస్తారా అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే, ఈ పరిస్థితిలోనే మక్కల్ సెల్వన్ విజయ్ సేతుపతి పూరీకి అవకాశం ఇవ్వడం ఆశ్చర్యం కలిగించింది. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ సేతుపతి హీరోగా రాబోతోన్న ఈ సినిమా సినీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ చేస్తోంది. పూరీ స్వయంగా నిర్మిస్తున్న ఈ సినిమా కాస్టింగ్ పనులు జోరుగా సాగుతున్నాయి.

ఇప్పటికే టబు, దునియా విజయ్ లను ఫైనల్ చేసిన పూరీ తాజాగా హీరోయిన్‌గా సంయుక్తా మీనన్‌ను ఎంపిక చేశారు. ఈ సినిమాపై పూరీ చాలా ఫోకస్‌తో పనిచేస్తున్నారని టాలీవుడ్ టాక్. తన అన్ని అస్త్రాలను ఈ ప్రాజెక్ట్ కోసం ఉపయోగించేందుకు పూరీ సిద్ధమయ్యాడని తెలుస్తోంది. పూరీ సినిమా అంటే వేగంగా పూర్తయ్యే సినిమాలు, అలాగే హిట్ సినిమాలు అన్న ఇమేజ్ ఒకప్పటినుంచీ ఉంది. అయితే, ఇటీవల పూరీ సినిమాలు ఎక్కువ సమయం తీసుకోవడంతో బడ్జెట్ పెరిగిపోతోంది. అందుకే ఇప్పుడు పూరీ తన పాత శైలి మాదిరి వేగంగా సినిమా పూర్తిచేసి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసుకున్నాడట.

విజయ్ సేతుపతీ కూడా పూరీ సినిమాకు కేటాయించిన డేట్లలోనే షూట్ పూర్తయ్యేలా ప్లాన్ చేసుకున్నారని సమాచారం. పూరీ జగన్నాథ్ సరైన దారిలో ఉన్నాడని అందరూ భావిస్తున్నారు. హిట్ సినిమాకు కావలసిన అన్నీ పక్కా చేస్తూ, తన మార్క్ మాస్ ఎంటర్టైన్మెంట్‌ని మళ్లీ ప్రేక్షకులకు అందించేందుకు పూరీ కృషి చేస్తున్నారు. విజయ్ సేతుపతిని ఒప్పించడమే పూరీకి సగం సక్సెస్ లాంటిదని సినీ జనాలు అంటున్నారు. గతంలో ఎక్కువగా నెగటివ్ రోల్స్‌లో కనిపించిన విజయ్ సేతుపతీ ఇప్పుడు హీరో ఓరియెంటెడ్ రోల్ చేయాలని నిర్ణయించుకోవడం పూరీ సినిమాకు కలిసొచ్చే అంశంగా భావించవచ్చు.

ఇప్పుడు పూరీ సినిమాతో విజయ్ సేతుపతి బౌన్స్ బ్యాక్ అవ్వాలని ఆశిస్తుండగా, పూరీ జగన్నాథ్‌కి ఈ ప్రాజెక్ట్ ఎంత పెద్ద విజయాన్ని అందిస్తుందో చూడాలి. పూరీ మార్క్ సక్సెస్ కొడితే డైరెక్టర్ అభిమానులు కూడా హ్యాపీ అవ్వడం ఖాయం!


Recent Random Post: