
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బింబిసార ఫేమ్ వశిష్ట దర్శకత్వంలో రూపొందుతోన్న భారీ ప్యాన్ ఇండియా సినిమా “విశ్వంభర”. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సోషియో ఫాంటసీ జానర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్‌ను డైరెక్టర్ వశిష్ట నెట్టింట షేర్ చేశారు.
“విశ్వంభర” మ్యూజిక్ సిట్టింగ్స్ ప్రస్తుతం జరుగుతున్నట్లు, ఈ కార్యక్రమంలో చంద్రబోస్, కీరవాణి, చిరంజీవి కలిసి దిగిన ఫోటోను వశిష్ట పోస్ట్ చేశారు. సినిమా సంగీతాన్ని కీరవాణి అందించినందుకు కీరవాణికి ధన్యవాదాలు తెలుపుతూ, ఆడియన్స్ ఈ పాటలను చాలా ఇష్టపడతారని, సినిమా రిలీజ్ కోసం వేచి చూస్తున్నట్లు తెలియచేశారు.
విశ్వంభర కోసం కీరవాణి ప్రత్యేకంగా మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నారని, వీఎఫ్ఎక్స్‌కు ప్రాధాన్యాన్ని ఇవ్వడంతో ఈ సినిమాకు తగిన బీజీఎం కోసం కీరవాణి శ్రమిస్తున్నాడని తెలుస్తోంది. సినిమాకు సంబంధించిన హైలైట్స్‌లో కీరవాణి సంగీతం కూడా ఒక ముఖ్యాంశంగా నిలవనుందని సమాచారం. “భోళా శంకర్” డిజాస్టర్ అయిన తర్వాత మెగా ఫ్యాన్స్ ఈ సినిమాపై భారీ ఆశలను పెట్టుకున్నారు.
త్రిష హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, ఈషా చావ్లా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. యూవీ క్రియేషన్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమాకు రిజిల్ డేట్‌ను మేకర్స్ ఇంకా ప్రకటించలేదు. మొదట “విశ్వంభర” సంక్రాంతికి రిలీజ్ కావాల్సింది. అయితే షూటింగ్ ఆలస్యం, వీఎఫ్ఎక్స్ వర్క్స్, ఇతర కారణాల వల్ల అది వాయిదా పడింది. అయితే, మే 9వ తేదీన ఈ సినిమా విడుదల కోసం మేకర్స్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. గతంలో ఈ రోజు చిరంజీవి నటించిన సోషియో ఫాంటసీ మూవీ “జగదేక వీరుడు అతిలోక సుందరి” కూడా రిలీజ్ అయ్యింది.
Recent Random Post:















