
మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఫాంటసీ ఎంటర్టైనర్ విశ్వంభర నుంచి ఇప్పటివరకు రెండు ప్రమోషనల్ కంటెంట్లు వచ్చాయి. తొలి టీజర్‌కు వచ్చిన నెగటివ్ రెస్పాన్స్ సినిమాపై ఓ ముదురు నీడ వేసింది. టీజర్ ఇంపాక్ట్ కారణంగా రిలీజ్ డేట్ వాయిదాలు పడటం, ఓటీటీ డీల్స్ ఆలస్యం కావడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. అయితే డ్యామేజ్ తలచుకున్నా, టీమ్ వెంటనే అప్రమత్తమై విఎఫెక్స్ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, ప్రతి ఫ్రేమ్ పర్ఫెక్ట్గా ఉండేలా చూసుకుంటోంది.
చిరంజీవి సూచనలతో దర్శకుడు వశిష్టకు దర్శక దిగ్గజాలు వివి వినాయక్, నాగ్ అశ్విన్‌లు సలహాలు ఇస్తున్నారని టాక్ ఉన్నా, అది ఎంతవరకు నిజమో తేలాల్సి ఉంది.
ఇప్పటికే విడుదలైన మొదటి సింగిల్ “రామ రామ” పాటకు ఊహించినంత రెస్పాన్స్ రాలేదు. కీరవాణి కంపోజిషన్ మంచి మ్యూజికల్ క్వాలిటీ ఉన్నప్పటికీ, ట్రెండీ టచ్ లోపించడంతో యూత్‌ను ఆకట్టుకోలేకపోయింది. ఇదే సమయంలో “రఘుకుల తిలక రామా” అంటూ ఓ ప్రైవేట్ సాంగ్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ప్రమోషన్ లేని పాటకి వచ్చిన స్పందన చూసి, కొన్ని ప్రొడక్షన్ హౌస్‌లు ఆ పాట హక్కుల కోసం ఒరిజినల్ క్రియేటర్‌ను సంప్రదిస్తున్నారట. చార్ట్‌బస్టర్ అంటే అంతే—చెప్పకుండా హిట్ అవ్వడం!
విశ్వంభర టీమ్ ఇప్పుడు చేయాల్సిన పని స్పష్టంగా ఉంది. నెక్స్ట్ ప్రమోషనల్ కంటెంట్ — అది కొత్త టీజర్ అయినా, ట్రైలర్ అయినా, లేక ఓ మేఘా మ్యూజికల్ నెంబర్ అయినా — ప్రేక్షకుల్లో అంచనాలను పెంచేలా ఉండాలి. అటు ఫ్యాన్స్‌లో హైప్ తీసుకురావాలి, ఇటు బిజినెస్ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తించాలి.
ప్రస్తుతం మెగాఫ్యాన్స్ మొత్తం అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చే సినిమాపై ఎక్కువగా ఫోకస్ చేస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో విశ్వంభర హైప్ పెంచాలంటే ప్రమోషన్ స్ట్రాటజీలో మెజిక్ చేయాల్సిందే. ప్రేక్షకుల మనసుల్లో “ఇదే మా మెగాస్టార్ ఫిల్మ్” అనిపించేలా ఒక పవర్‌పుల్ కంటెంట్ రావాల్సిన సమయం ఇదే!
Recent Random Post:















