
మెగా ఫ్యామిలీ నుంచి తెరంగేట్రం చేసిన మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్, తన తొలి చిత్రం ఉప్పెన తోనే బాక్సాఫీస్‌ను షేక్ చేశాడు. బుచ్చిబాబు సాన దర్శకత్వంలో వచ్చిన ఈ ప్రేమకథా చిత్రం ₹100 కోట్ల క్లబ్‌లోకి ఎంటర్ కావడంతో ఇండస్ట్రీలో ఓ సెన్సేషన్‌గా నిలిచింది. అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు మాత్రం ఆ స్థాయిలో మెప్పించలేకపోయాయి.
కొండపొలం, ఆadikeshava లాంటి సినిమాల తర్వాత వైష్ణవ్ తన కథల ఎంపిక విషయంలో మరింత జాగ్రత్తగా మారాడు. “కథ అనేది కచ్చితంగా కిక్ ఇవ్వాలి… లెక్క కోసం కాదు, లక్ష్యం కోసం సినిమా చేయాలి” అన్న దృఢ సంకల్పంతో ప్రస్తుతం తగిన కథ కోసం టైం తీసుకుంటున్నాడు.
మెగా బ్యానర్ బ్యాక్అప్ ఉన్నా కూడా, వైష్ణవ్ తేజ్ మాత్రం తన టాలెంట్‌తోనే పేరు తెచ్చుకోవాలని భావిస్తున్నాడు. అందుకే ఈసారి ఏ చిన్న తగ్గింపూ లేకుండా పవర్ఫుల్ కంటెంట్‌తో ప్రేక్షకుల ముందుకు రావాలనే ప్రయత్నాల్లో ఉన్నాడు.
ఇదిలా ఉండగా, మరో మెగా యువ హీరో సాయి ధరమ్ తేజ్ కూడా బ్రో తర్వాత ప్రస్తుతం సంబరాల యేటిగట్టు అనే చిత్రంలో నటిస్తున్నాడు. వైష్ణవ్ మాత్రం ఎలాంటి కథకైనా సరిపోయే కటౌట్ ఉన్నా, ఇప్పటి ట్రెండ్‌కి తగినట్టు కొత్తగా, ప్రామాణికంగా ఉండే కథతోనే తిరిగి బౌన్స్ బ్యాక్ కావాలనే పట్టుదలతో ఉన్నాడు.
ఈ తరుణంలో యువ దర్శకులు కూడా వైష్ణవ్‌కు విభిన్న కథలతో కథనాలు చెబుతున్నా, ఆయన మాత్రం ఇప్పటిదాకా ఏ స్క్రిప్ట్‌నీ ఫిక్స్ చేయలేదు. మంచి కంటెంట్‌తో హిట్ కొడితేనే కెరీర్ నిలబడుతుందని, కాబట్టి సమయం తీసుకుని సరైన నిర్ణయం తీసుకోవాలని వైష్ణవ్ భావిస్తున్నాడు.
ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఆశలు… వైష్ణవ్ తేజ్ ఎప్పుడు మళ్లీ ఫుల్ ఫాంలోకి వస్తాడా? ఏ దర్శకుడితో కలిసి మరో సెన్సేషనల్ సినిమా అందిస్తాడా అన్న దానిపై ఉన్నాయి. ఒక మంచి కథ దొరికితే… మళ్లీ వైష్ణవ్ మ్యాజిక్ మనం స్క్రీన్‌పై చూడటంలో సందేహం లేదు!
Recent Random Post:















