
ప్రముఖ బాలీవుడ్ బ్యూటీ శిల్పా శెట్టి సెప్టెంబర్ 3న ముంబైలోని తన బాస్టియన్ రెస్టారెంట్ మూసివేయనున్నట్టు ఇంస్టాగ్రామ్ ద్వారా ప్రకటించిన విషయం తెలిసిందే. దీని తరువాత అభిమానులు, ఫ్యాన్స్, సినీ సెలబ్రిటీలు, నెటిజన్లు సోషల్ మీడియా ద్వారా ఎందుకు మూసివేస్తున్నారు అనే ప్రశ్నలు ఎదురుపెట్టారు.
ఈ ప్రశ్నలకు స్పందిస్తూ శిల్పా శెట్టి మరో వీడియోను ఇంస్టాగ్రామ్లో షేర్ చేశారు. ఆమె చెప్పినట్టే, “బాస్టియన్ మూసివేస్తున్నట్లు ప్రకటించడంతో సుమారు 4,500కి పైగా ఫోన్ కాల్స్ వచ్చాయి. ఇది చూసి నాకు చాలా సంతోషంగా ఉంది. బాస్టియన్ రెస్టారెంట్ పై ఇంతమంది ప్రేమ చూపించడం నా హృదయాన్ని తాకింది.
మేము రెస్టారెంట్‌ను పూర్తిగా మూసివేయడం లేదు. ఒక అధ్యాయాన్ని ముగించుకున్నాం. త్వరలో ఈ స్థలంలో ‘అమ్మకై’ అనే కొత్త రెస్టారెంట్ తెరవబోతున్నాం. ఇందులో నా మూలాలైన మంగళూరు వంటకాలను ప్రేక్షకులకు పరిచయం చేయబోతున్నాం.
అదేవిధంగా, బాస్టియన్ రెస్టారెంట్‌ను ‘బాస్టియన్ బీచ్ క్లబ్’ పేరుతో జుహూ ప్రాంతంలో మళ్లీ ప్రారంభించబోతున్నాం. నిజానికి, ఈ బాంద్రాలోని బాస్టియన్ నా జీవితానికి మూలాధారం లాంటిది. ఒక చెట్టు ఎలా ఫలాలను ఇస్తుందో, ఈ బాస్టియన్ కూడా నాకు జీవితానికి బహుమతులు ఇచ్చింది. కాబట్టి దీన్ని ఎలాంటి పరిస్థితుల్లోనూ మూసివేయము. అక్టోబర్‌లో మేము ప్రారంభిస్తాము, దయచేసి ఆ వరకు ఓపిక పట్టండి. “మూసివేస్తున్నాం” అనే వార్తల్లో నిజం ఏమీ లేదు” అని ఆమె స్పష్టం చేశారు.
ముంబైలో బాస్టియన్ రెస్టారెంట్ మంచి పేరు పొందినది. ఈ రెస్టారెంట్ చివరగా జరుపుకోబోయే విందులో అత్యంత సన్నిహితులు, వ్యాపార భాగస్వాములు హాజరుకావనున్నారు. శిల్పా శెట్టి చేసిన క్లారిటీ అభిమానులను ఆనందపరిచింది మరియు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అయ్యింది.
Recent Random Post:















