శృతి హాసన్ జ్వరంపై మెగా ఫ్యాన్స్ అనుమానాలు నిజం కాదు

మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ లో శృతి హాసన్ కనిపించక పోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతకు ఒక్క రోజు ముందు బాలకృష్ణ వీర సింహారెడ్డి సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుకలో సందడి చేయడంతో పాటు.. స్టేజ్ పై డాన్స్ కూడా చేసి అందరిని ఆశ్చర్యపరిచిన విషయం తెల్సిందే.

వాల్తేరు వీరయ్య సినిమా ఈవెంట్ లో పాల్గొనక పోవడంకు కారణం జ్వరం అంటూ స్వయంగా చిరంజీవి తెలియజేశాడు. శృతికి జ్వరం రావడం వల్ల రాలేక పోయింది అంటూ చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై మెగా ఫ్యాన్స్ అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీర సింహారెడ్డి సినిమా యొక్క ప్రీ రిలీజ్ వేడుకకు హాజరు అవ్వడంతో పాటు బాలయ్య తో కలిసి అన్ స్టాపబుల్ లో కూడా శృతి పాల్గొన్నది అనేది టాక్.

ఒక వైపు వాల్తేరు వీరయ్య సినిమా యొక్క ప్రమోషన్ కు హాజరు కావాలంటే జ్వరం అంటూ చెబుతున్న శృతి హాసన్ మరో వైపు బాలయ్య సినిమాకు మాత్రం అన్ని విధాలుగా సహకరిస్తూ ప్రమోషన్ కార్యక్రమాలకు హాజరు అవ్వడం విడ్డూరంగా ఉంది అంటూ మెగా అభిమానులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య అన్ స్టాపబుల్ షో లో వీర సింహారెడ్డి యూనిట్ తో కలిసి శృతి హాసన్ పాల్గొన్నట్లుగా వార్తలు వస్తున్న నేపథ్యంలో మెగా ఫ్యాన్స్ ఆమె జ్వరం గురించి అనుమానాలు వ్యక్తం చేయడం అనేది చాలా కామన్ విషయం. అసలు విషయం ఏంటీ అంటే అన్ స్టాపబుల్ ఎపిసోడ్ కోసం శృతి హాసన్ హాజరు కాలేదు.

బాలకృష్ణ తో పాటు దర్శకుడు గోపీచంద్ మలినేని మరియు కీలక పాత్రలో నటించిన వరలక్ష్మి శరత్ కుమార్ లు మాత్రమే అన్ స్టాపబుల్ షో లో సందడి చేసినట్లుగా తెలుస్తోంది. థమన్ మరియు శృతి హాసన్ లు కొన్ని నిమిషాల పాటు ఫోన్ ద్వారా మాట్లాడినట్లుగా ఆహా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. కనుక శృతి జ్వరం విషయంలో మెగా ఫ్యాన్స్ కి అనుమానం అక్కర్లేదు.


Recent Random Post: