శేఖర్ కమ్ముల కుబేరపై విశేషాలు

Share


హ్యాపీడేస్, ఫిదా, లవ్ స్టోరీ లాంటి హిట్ సినిమాలతో యువతను ఆకట్టుకున్న శేఖర్ కమ్ముల ఇప్పుడు మరో విభిన్న ప్రయత్నంతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆయన దర్శకత్వంలో ధనుష్, నాగార్జున కీలక పాత్రల్లో నటించిన ‘కుబేర’ సినిమా జూన్ 20న థియేటర్లలో విడుదల కానుంది. ఇది లవ్ స్టోరీ కాకుండా సొషియో–పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందింది.

ఈ కథ ఎలా వచ్చిందో చెబుతూ శేఖర్ కమ్ముల, ప్రపంచంలో చాలా ధనవంతుడైన వ్యక్తి, మరోవైపు అతి పేదవాడి మధ్య జరిగే సంఘర్షణ ఆధారంగా కథను నిర్మించాలనే ఆలోచన కలిగిందని చెప్పారు. ‘కుబేర’ అంటే బిలియనీర్ వర్సెస్ బెగ్గర్ కథ అని తక్కువ మాటల్లో వివరిస్తూ, ఇది చెప్పాల్సిన కథ అని అనిపించిందని తెలిపారు.

ఈ సినిమాలో రాజకీయ కోణం కూడా ఉందని, అయితే అది పాత్రల అవసరానుసారంగా ఉన్నదని అన్నారు. నాగార్జున పాత్ర గురించి రాసే సమయంలో ఆయన కచ్చితంగా బాగానే చేయగలరని అనిపించిందని, ప్రేక్షకులకు ఆయన ఇందులో కొత్తగా కనిపించబోతున్నారని పేర్కొన్నారు. ధనుష్ గురించి మాట్లాడుతూ, అలాంటి పాత్రలో ఆయనే సరిపోతారని, కథ వినగానే వెంటనే ఒప్పుకున్నారని చెప్పారు. ధనుష్ ఒక డైరెక్టర్ కూడా కావడం వల్ల కథ చెప్పేటప్పుడు కొంచెం టెన్షన్ అనిపించిందని కానీ ఆయన సహకారం అద్భుతంగా ఉందని చెప్పారు.

ఇది ఓ లవ్ స్టోరీ కాదని, గత చిత్రాల కంటే పది రెట్లు బలమైన చిత్రమవుతుందని శేఖర్ తెలిపారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మళ్లీ ఒక కొత్త ఉత్సాహాన్ని ఇచ్చిందన్నారు. ముంబైలో ఎక్కువ భాగం షూటింగ్ జరగడంతో ట్రాఫిక్ సమస్యలు, పర్మిషన్ల విషయంలో కొన్ని సవాళ్లు ఎదురయ్యాయని చెప్పారు.

రాజమౌళి చేసిన కామెంట్స్‌కి స్పందిస్తూ, సినిమాలో ఎక్కువ మంది స్టార్లు ఉండటంతో వారి డేట్స్‌ను మేనేజ్ చేయాల్సి వచ్చిందని, అందుకే ఆలస్యం జరిగిందని వివరించారు. తన 25 ఏళ్ల కెరీర్‌లో పెద్దగా కష్టాలు తగలలేదని, ఎప్పుడూ సింపుల్‌గా ఉంటానని, ప్రేక్షకులు తనపై చూపించే ప్రేమే తనకు చాలా గొప్పదని భావిస్తున్నట్టు తెలిపారు. పారితోషికం తీసుకుని సినిమాలు చేసానని, కొన్ని సందర్భాల్లో నష్టపోయినా ఆడియన్స్ ప్రేమ ముందు వాటిని పట్టించుకోలేదని చెప్పారు.

లీడర్ సీక్వెల్ విషయాన్ని కూడా స్పృశించిన శేఖర్, అప్పటి పరిస్థితులు, ఇప్పటి పరిస్థితులు చాలా మారిపోయాయని, ప్రేక్షకుల అభిరుచులు కూడా మారాయని అన్నారు. నానితో కథా చర్చలు కొనసాగుతున్నాయని, ఆ ప్రాజెక్ట్‌కు ఇంకా టైం ఉందని తెలిపారు.


Recent Random Post: