ఈ సంక్రాంతికి రిలీజైన హనుమాన్ సినిమా ఎంతటి సంచలనం సృష్టించిందో తెలిసిందే. మైథలాజికల్ టచ్ ఉన్న కాన్సెప్ట్ తీసుకుని.. అన్ని వర్గాల ప్రేక్షకులూ మెచ్చేలా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దాడు యువ దర్శకుడు ప్రశాంత్ వర్మ. మన పురాణ పురుషుల పాత్రలను సరిగ్గా వాడుకుంటే హాలీవుడ్ సూపర్ హీరో చిత్రాలకు ఏమాత్రం తీసిపోని సినిమాలను తీయొచ్చని ప్రశాంత్ వర్మ రుజువు చేశాడు.
ఐతే ఇలాంటి ప్రయత్నాలు గతంలో జరగలేదని కాదు. హనుమంతుడి పాత్ర ఆధారంగా 20 ఏళ్ల కిందట ‘శ్రీ ఆంజనేయం’ అనే ఫాంటసీ మూవీ తీశాడు కృష్ణవంశీ. ఆ సమయానికి అద్భుతమైన గ్రాఫిక్స్‌తో కొన్ని సన్నివేశాలను చాలా బాగా తీశాడు కృష్ణవంశీ. హనుమంతుడి పాత్రతో ముడిపడ్డ ప్రతి సన్నివేశం బాగుంటుంది. ఇప్పుడు చూసినా ఆ సీన్లు ఎగ్జైటింగ్‌గా అనిపిస్తుంటాయి.
‘హనుమాన్’ పెద్ద సక్సెస్ అయిన నేపథ్యంలో చాలామంది ‘శ్రీ ఆంజనేయం’ను గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఆ సినిమా అప్పుడు ఎందుకు ఆడలేదో.. ఇప్పుడొస్తే పెద్ద హిట్టయ్యేదేమో అని అభిప్రాయపడుతున్నారు. నిజానికి చాలామంది అప్పట్లో ఫీలైన విషయం ఏంటంటే.. ‘శ్రీ ఆంజనేయం’ కథ బాగుంటుంది. హనుమంతుడి పాత్రను, దాంతో ముడిపడ్డ సన్నివేశాలను బాగా తీర్చిదిద్దాడు కృష్ణవంశీ. కానీ హీరోయిన్ పాత్ర అందులో పెద్ద మైనస్ అయింది.
ఎంతో భక్తి భావం నింపే సన్నివేశాలున్న సినిమాలోనే ఛార్మి పాత్రతో విపరీతంగా ఎక్స్‌పోజింగ్ చేయించడం సింక్ కాలేదు. పూల గుమ గుమ పాటలో అయితే ఎక్స్‌పోజింగ్ హద్దులు దాటిపోయింది. మొత్తంగా ఛార్మి పాత్రే అందులో చికాకు పెట్టేలా ఉంటుంది. ఆ పాత్రను నీట్‌గా తీర్చిదిద్ది ఉంటే.. ఆ సినిమా ఫలితమే వేరుగా ఉండేదన్నది విశ్లేషకుల మాట. చాలామంది నెటిజన్లు కూడా ఇదే విషయం ప్రస్తావిస్తుండగా.. దర్శకుడు కృష్ణవంశీ ఆ కామెంట్లు ఎలా స్పందించాలో తెలియని అయోమయంలో పడిపోతున్నాడు.
Recent Random Post: