
స్టార్ యాక్టర్ రిషబ్ శెట్టికి ప్రస్తుతం ఇండియన్ సినిమా లో ఉన్న క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. కాంతారతో నేషనల్ లెవెల్లో పాపులారిటీ అందుకున్న ఆయన, వరుస క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా రిషబ్ శెట్టి మరో భారీ ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్.
ఆంధ్ర భోజుడు, విజయనగర సామ్రాజ్య చక్రవర్తి శ్రీకృష్ణదేవరాయల జీవిత కథ ఆధారంగా బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అశుతోష్ గోవారికర్ తెరకెక్కించబోయే చిత్రంలో రిషబ్ శెట్టి టైటిల్ రోల్ పోషించనున్నారని సమాచారం. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ దాదాపు పూర్తి అయ్యిందని, త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందని సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
చారిత్రక కథాంశాల్లో ప్రత్యేకత ఉన్న అశుతోష్ గోవారికర్, లగాన్, జోధా అక్బర్, పానిపట్, మోహెంజోదారో వంటి క్లాసిక్ సినిమాలతో ప్రేక్షకులను మెప్పించారు. కొంతకాలంగా దూరంగా ఉన్న ఆయన మళ్లీ శ్రీకృష్ణదేవరాయల బయోపిక్‌తో వస్తుండడం అందరిలో ఆసక్తిని కలిగిస్తోంది. ఈ బయోపిక్‌పై ఇప్పటికే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. రిషబ్ శెట్టి ఈ పాత్రలో ఎలా మెప్పిస్తారో అన్నది సినీ ప్రేమికుల్లో ఆసక్తికరం గా మారింది.
ఇంతకు ముందు స్వర్గీయ ఎన్టీఆర్ మహామంత్రి తిమ్మరుసులో శ్రీకృష్ణదేవరాయలుగా అదరగొట్టారు. ఆదిత్య 369లో బాలయ్య కనిపించగా, ఇటీవల శ్రీకాంత్ దేవరాయ అంటూ ఓ సినిమా చేశాడు. కానీ అది పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడు రిషబ్ శెట్టి మాత్రం తన మార్క్ పెర్ఫార్మెన్స్తో మరోసారి హిస్టరీ రిపీట్ చేస్తారా అనే చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం రిషబ్ శెట్టి కాంతార చాప్టర్ 1, హనుమాన్ సీక్వెల్, మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ బయోపిక్ వంటి భారీ ప్రాజెక్టుల్లో నటిస్తున్నారు. మరి ఈ సినిమాలు రిషబ్ కెరీర్లో మరో మైలురాయిగా మారుతాయా లేదా అన్నది వేచి చూడాలి.
Recent Random Post:















